తెలంగాణలో రైతు బంధు పథకం కింద రైతులకు ప్రభుత్వం నిధులను జమ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వ్యవసాయి విస్తరణ అధికారి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారి కల్లేపల్లి పరశురాములు ఈ లేఖ రాసినట్లు సమాచారం.రైతుబంధు పథకం కింద 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమ చేసేలా పరిమితి పెట్టాలని లేఖలో పేర్కొన్నారు.
మిగిలిన నిధులను పొలాలకు వెళ్లే కాలిబాటలను నిర్మించడానికి ఉపయోగించాలంటూ ఏఈవో లేఖ రాశారు.లేఖను తపాలా ద్వారా హైదరాబాద్ ప్రగతిభవన్ చిరునామాకు పంపారని తెలుస్తోంది.