మన దేశంలోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తిరుమల తిరుపతి శ్రీవారి పుణ్యక్షేత్రం కూడా ఒకటి.ఈ పుణ్యక్షేత్రానికి దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుని పూజలు, అభిషేకాలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నామని సంతోషంగా ఇళ్లకు వెళుతూ ఉంటారు.
అలాంటిది తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల దేవస్థానం షాక్ ఇచ్చింది.వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కౌంటర్ల పై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ రోజు నుంచి ఈ వైకుంఠ ద్వార దర్శనం కౌంటర్ల ను తగ్గించేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.ఈ రోజు నుంచి ఈ నాలుగు ప్రాంతాలలో మాత్రమే టోకెన్లు జారీ చేసుకుందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.
అలిపిరి, శ్రీనివాస, విష్ణు నివాసం, గోవిందరాజు సూత్రాల వద్ద మాత్రమే టోకెన్లను జారీ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది.ఇప్పటి నుంచి ఈ విషయం దృష్టిలో పెట్టుకొని తిరుమలకు రావాలని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి చరిత్రలో ఎప్పుడూ లేనంత హుండీ ఆదాయం సమకూరిందని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.వైకుంఠ ఏకాదశి కావడంతో దర్శనానికి భక్తులు దేశంలోనీ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు.ఆదివారం అర్ధ రాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించామని ఈ సందర్భంగా వెల్లడించారు.దీని వల్ల భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయిందని కూడా చెప్పారు.తిరుమలలో భక్తులు హుండీలలో స్వామివారికి సమర్పించిన కానుకలను మొత్తం లెక్కించగా దాదాపు 7.68 కోట్లు వచ్చిందని దేవస్థానం అధికారులు వెల్లడించారు.