25 ఏళ్ల పాటు ఇంటిలో ఏ విద్యుత్ ప‌రిక‌రం వాడినా బిల్లు రాకూడ‌ద‌నుకుంటే...

మీ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా విద్యుత్తు బిల్లును ఆదా చేసుకోవచ్చు.దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత రాబోయే 25 ఏళ్ల పాటు మీ కరెంటు బిల్లు జీరో అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

 If You Want To Avoid Getting Bill For 25 Years , Solar Panels, Solar Energy, Bes-TeluguStop.com

సోలార్ ప్యానెల్ అనేది సౌర‌శ‌క్తితో ఛార్జ్ అవుతుంది.అందుకే దీనికి విద్యుత్ అవసరం లేదు.

ఈ సోలార్ ప్యానెల్ జీవితకాలం 25 సంవత్సరాలు ఉంటుంది.ఈ విధ‌మైన వన్-టైమ్ పెట్టుబడిలో మీరు 25 సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ అందుకోవ‌చ్చు.

ఈ విధంగా వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ చేయడం ద్వారా ఖరీదైన విద్యుత్ బిల్లుల భారాన్ని వ‌దిలించుకోవ‌చ్చు.మీ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకున్న ప‌క్షంలో మీ అవసరానికి అనుగుణంగా త‌గినంత విద్యుత్తు లభిస్తుంది.

ఇందుకోసం ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతున్న‌ది.

సౌరశక్తి వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

ఇందుకు సబ్సిడీ ఇస్తున్న‌ది.ఇంటి పైకప్పుపై సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్ర‌భుత్వ అధికారులు సబ్సిడీ అంద‌జేస్తారు.

మీరు మీ అవసరాల‌ను అనుస‌రించి, దాని ప్రకారం అందుకు త‌గిన‌ శక్తితో కూడిన సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు.ఇందుకు ముందుగా మీరు మీ ఇంటి విద్యుత్ వినియోగాన్ని ప‌రిశీలించాలి.

ఉదాహరణకు ఇంట్లో 4 ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్, 8 నుంచి 10 లైట్లు, వాటర్ మోటార్, గీజర్, ప్రెస్, టీవీ సహా ఇతర ఎలక్ట్రిక్ ఉత్పత్తులను వాడితే రోజుకు 8 నుంచి 10 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది.ఇటువంటి సందర్భంలో మీరు రెండు కిలోవాట్ల‌ సోలార్ ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

భారతదేశంలో సౌరశక్తిని ప్రోత్సహించడం కోసం, నూత‌న పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సోలార్ రూఫ్‌టాప్ పథకాన్ని గ‌తంలో ప్రారంభించింది.డిస్కమ్ ప్యానెళ్లతో ప్రమేయం ఉన్న ఏ విక్రేత ద‌గ్గ‌ర నుండి అయినా వినియోగదారులు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌ళ్ల కోసం సంప్ర‌దించి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Telugu Ministryenergy, Solar Energy, Solar Panels-Latest News - Telugu

ఆ తర్వాత సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.మీరు ఇంటి పైకప్పుపై 3 కిలోవాట్ల వరకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అమర్చిన ప‌క్షంలో మీరు ప్రభుత్వం నుండి 40 శాతం వరకు సబ్సిడీని అందుకోవ‌చ్చు.అదే సమయంలో 10 కిలోవాట్ల‌ వరకు గ‌ల‌ సోలార్ ప్యానెల్స్‌పై 20 శాతం వరకు సబ్సిడీ ఇచ్చే అవ‌కాశం ఉంది.2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు కోసం మీరు సుమారు రూ.1.20 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే ప్రభుత్వం నుండి 40 శాతం సబ్సిడీ పొందితే, మీకు సుమారుగా కేవలం 72 వేల రూపాయలు మాత్రమే ఖర్చ‌వుతుంది.అప్పుడు ప్ర‌భుత్వం మీకు రూ.48,000 వరకు సబ్సిడీ ఇస్తుంది.సోలార్ ప్యానెల్ 25 సంవత్సరాల పాటు వినియోగంలో ఉంటుంది.

అంటే ఇందుకోసం మీరు ఒక్కసారి మాత్రమే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఫ‌లితంగా 25 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ అందుకోవ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube