యూఏఈ టూరిస్టులకు కొత్త వీసా నిబంధనలు.. ప్రత్యేకత ఏమిటంటే..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసా నిబంధనలలో కొత్త మార్పులు చేసింది.ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనల ప్రకారం మీ పేరు వీసాపై రాయకపోతే మీరు దేశానికి రాకుండా నిషేధించబడవచ్చు.

 Uae New Visa Rules For Tourists Details, Uae , Uae Visa, Uae Visa Rules, Uae Tou-TeluguStop.com

కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక ప్రయాణికుడు తన మొదటి పేరు, ఇంటి పేరు రెండిటిని పాస్ పోర్ట్ లో కచ్చితంగా రాయాలి.వారి పాస్ పోర్ట్ లో మొదటి పేరు, ఇంటి పేరు రెండు లేని ప్రయాణికులు యూఏఈ లోకి ప్రవేశించడానికి అనుమతిని నిషేధించారు.

టూరిస్ట్, ఆన్ అరైవల్ పై యూఏఈకి వచ్చే వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.కొత్త యూఏఈ వీసా నిబంధనల ప్రకారం పాస్ పోర్ట్ లో అదే పేరుతో ఉన్న ప్రయాణికులకు వీసా జారీ చేయబడదు.

వారు దేశం నుంచి బయటకు వెళ్లడానికి కూడా అనుమతి ఉండదు.వీసా ఇప్పటికే జారీ చేయబడితే పాస్ పోర్ట్ లో అదే పేరుతో ఉన్న ప్రయాణికుడిని ఇమిగ్రేషన్ కార్యాలయానికి అనుమతించని ప్రయాణికుడిగా ప్రకటించే అవకాశం ఉంది.

అయితే వర్కింగ్ వీసాలు కలిగి ఉన్న వ్యక్తులకు ఈ నిబంధన వర్తించే అవకాశం లేదు.ఇంకా చెప్పాలంటే ప్రయాణికుడి మొదటి పేరు అనుపం, అతను మొదటి పేరు విభాగంలో ఈ పేరును రాసి ఉండి, అతని ఇంటిపేరు విభాగాన్ని ఖాళీగా ఉంచాడు అనుకుందాం.

అప్పుడు అతని వీసా ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు.ఇంటిపేరు ఉన్న ఖాళీ స్థలంలో ఇంటిపేరును రాసి పేరు విభాగాన్ని ఖాళీగా ఉంచితే కూడా అతని వీసా చెల్లుబాటు కాదు.యూఏఈ కొత్త వీసా నిబంధనలను కూడా అమలు చేసింది.ఇది గోల్డెన్ వీసాను కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది.కొత్త రకాల ప్రవేశ వీసా నివాస అనుమతిని కూడా పరిచయం చేస్తోంది.గోల్డెన్ వీసా అంటే యూఏఈ లో నివసిస్తున్న వారు పది సంవత్సరాల వరకు దీర్ఘకాలిక రెన్యువల్ ప్రెసిడెంట్ ను పొందే అవకాశం ఉంటుంది.

పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు లేదా వైద్యులు, శాస్త్రవేత్తలు, అద్భుతమైన విద్యార్థులు గోల్డెన్ వీసా తీసుకునే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube