ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.కష్టాల్లో ఉన్న వారి గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వారికి ఎంతో అండగా నిలబడుతుంటారు.
అలానే, ఆయన సామాన్య ప్రజలను మోటివేట్ చేయడానికి, జీవితంలో సక్సెస్ కావడానికి తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా అందర్నీ ఎంకరేజ్ చేస్తుంటారు.కాగా తాజాగా మండే మోటివేషన్ పేరుతో ఒక బర్డ్ వీడియో షేర్ చేశారు.
ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోని ట్వీట్ చేస్తూ.“ఈ అద్భుతమైన పక్షికి కట్టిన మినీ-క్యామ్ మనం ‘బర్డ్స్ ఐ వ్యూ’ అందిస్తోంది.నేను ఒక వారాన్ని ఎప్పుడూ బిగ్ పిక్చర్‌తో ప్రారంభించాలని అందరికీ సలహా ఇస్తాను.
అన్ని విషయాల గురించి పెద్ద పిక్చర్‌లో చూస్తేనే పూర్తి అవగాహన వస్తుంది.అప్పుడే ఉపయోగకరంగా ఉంటుంది.దానికి బదులుగా ప్లాన్ లేకుండా ముందుకు సాగితే ఇబ్బంది పడక తప్పదు.” అని చెప్పుకొచ్చారు.
మండే మోటివేషన్ అంటూ ఆనంద్ మహీంద్రా ఈ గద్ద వీడియోని షేర్ చేయడాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు.మీరు చెప్పినట్లు ప్రతి మండే రోజున తమ వీకెండ్ ఎలా ఉండాలో ఫుల్ క్లారిటీ తెచ్చుకుంటామని కామెంట్లు చేస్తున్నారు.కాగా మహీంద్రా షేర్ చేసిన వీడియోకి 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోలో ఒక పక్షి అందమైన ప్రకృతిలో రెండు గుట్టల మధ్య ప్రయాణిస్తూ మనకు అద్భుతమైన వ్యూ అందించడం చూడవచ్చు.