ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలలో కూడా ప్రతిరోజు కొంతమంది భక్తులు పూజలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఆ దేవాలయాలలోని దేవుళ్లకు ప్రత్యేకమైన కల్యాణోత్సవాలను భక్తులు జరుపుతూ ఉంటారు.
యూకే , యూరోప్ లలోని వివిధ దేశాలలో ఘనంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి.యూకే , యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పదకొండు పట్టణాలలో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
వైఖానస ఆగమం ప్రకారం తిరుమల దేవస్థానం నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు ఈ కల్యాణోత్సవాన్ని పూర్తి చేశారు.అన్ని నగరాల్లో శ్రీవారి కళ్యాణోత్సవానికి భారీ ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూశారు.
ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సహాయం చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సూచనలతో ఇంగ్లాండ్ లో బేసింగ్ స్టోక్ తెలుగు సంఘం, బెల్ఫాస్ట్ నార్త్ ఐర్లాండ్ లో నార్త్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, డబ్లిన్ ఐర్లాండ్, ఇండో ఐరిష్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్, జురిక్ స్విట్జర్లాండ్ లో స్విస్ వేదిక్ భక్తీ ఫౌండేషన్ ఇంకా చాలా ప్రాంతాలలో తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి వచ్చిన అర్చకులు స్వామివారి కల్యాణోత్సవాన్ని జరిపించారు.అయితే పారిస్ లో జరిగిన కళ్యాణం మహోత్సవంలో భారీ ఎత్తున తమిళ, పాండిచ్చేరి భక్తులు వచ్చారు.11 నగరాలలోని కళ్యాణోత్సవాలలో తెలుగు, భారతీయ భక్తులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారు కూడా అధిక సంఖ్యలో హాజరై దేవుళ్ళ ఆశీర్వాదాలు అందుకున్నారు.11 నగరాలలోని కళ్యాణ వాస్తవాలలో కళ్యాణోత్సవాలలో కొన్ని నగరాల్లోని తెలుగు భారతీయ ధార్మిక సేవా సంస్థల భక్తులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లను కూడా చేశారు.
LATEST NEWS - TELUGU