అగ్ర రాజ్యం లో గన్ కల్చర్ మరోసారి విరుచుకు పడింది.ఓ నైట్ క్లబ్ పై గుర్తు తెలియని దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా చాలామంది అమెరికన్ పౌరులు తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది పూర్తి వివరాల్లోకి వెళ్తే…
అమెరికాలోని కొలరాడో ఉన్న స్ప్రింగ్ ప్రాంతంలో ఉన్న క్లబ్ క్యూ అనే నైట్ క్లబ్ లో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
కేవలం స్వలింగ సంపర్కులు కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్లబ్ లో చాలా మంది గే జంటలు హాజరవుతుంటాయి.ఎప్పటిలానే క్లబ్ లో పార్టీ జరుగుతున్న క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తీ కాల్పులు జరుపుతున్నాడని సమాచారం అందడంతో హుటాహుటిన వచ్చిన కొలరాడో పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు 20 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగానే మృతులను, గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.కాగా పోలీసులు వచ్చిన వెంటనే క్లబ్ లోని అందరిని విచారిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అడుపులోకి తీసుకున్నారు.ఆ వ్యక్తే ఆ మారణహోమానికి కారకుడిగా భావిసున్నట్టుగా వెల్లడించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడి సిసి టీవీ పుటేజ్ లను పరీక్షిస్తున్నారు.ఇదిలాఉంటే అమెరికాలో తుపాకీ తూటాలకు అమాయక ప్రజల ప్రాణాలు బలైపోవడం కొత్తేమీ కాదు సగటున రోజుకి అమెరికా వ్యాప్తంగా ఏదో ఒకచోట తుపాకీ పేలుళ్లు వినపడుతూనే ఉంటాయి.
ఏదో ఒక మూలాన ఎవరో ఒకరు మృత్యువాత పడుతూనే ఉంటారు.బిడెన్ గన్ కల్చర్ పై నిషేధం విధించేందుకు బిల్ పాస్ చేయించినా ఇప్పటికి కార్యరూపం దాల్చక పోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అంటున్నారు గన్ కల్చర్ పై వ్యతిరేక గళం వినిపిస్తున్న స్వచ్చంద సంస్థలు…