టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి అందరికీ పరిచయమే.నటనపరంగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకు రెట్టింపు అభిమానాన్ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.
అతి తక్కువ సమయంలో స్టార్ హోదాకి చేరుకున్నాడు.ఇక గత ఏడాది విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్పతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
ఈ సినిమాతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు బన్నీ.ఈయన ఫ్యామిలీ గురించి కూడా అందరికీ బాగా పరిచయమే.
ఈయన తండ్రి, తాత అందరూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లే.ఇక ఈయన పెళ్లి జీవితానికి వస్తే.
స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకోగా వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
ఇక బన్నీ.
ఓ వైపు సినిమాలకు ఇంపార్టెంట్ ఇస్తూనే మరోవైపు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు.బన్నీ కి ఖాళీ సమయం దొరికితే చాలు వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని విదేశాలకు చెక్కేస్తాడు.
చాలావరకు సినిమాలపరంగా కాస్త బ్రేకు దొరికితే ఫ్యామిలీతో బాగా గడుపుతూ.ముఖ్యంగా తన కూతురు అర్హతతో మాత్రం బాగా ఆటలాడుతూ ఉంటాడు.
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది.ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ఆ వేదిక ద్వారా తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక తన సోషల్ మీడియాలలో ఎక్కువగా అల్లు అర్జున్ కు సంబంధించిన విషయాలు, తన పిల్లల వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ కంటే ఎక్కువగా.
కూతురు అర్హతో బాగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు.అల్లు అర్జున్ సోషల్ మీడియాను చాలా తక్కువ సందర్భాలలో వాడుతూ ఉంటాడు.
ఇక ఈయన కూడా తన పిల్లల ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ ఉంటాడు.ఇదంతా పక్కన పెడితే తాజాగా అల్లు అర్జున్ తన ఇన్ స్టాలో తన కూతురికి సంబంధించిన వీడియో షేర్ చేసుకున్నాడు.
ఈరోజు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా.తనకు శుభాకాంక్షలు తెలుపుతూ తన వీడియో పంచుకున్నాడు.అందులో అర్హ కందిరీగలకు గొడవ గురించి తన నాన్నకు ముద్దు ముద్దుగా చెబుతూ కనిపించింది.పైగా తెలుగులో చాలా క్యూట్ గా మాట్లాడింది.ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవ్వటంతో.అందరూ బన్నీ కూతురుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అంతేకాకుండా క్యూట్ వీడియో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక కొంతమంది.
స్టార్ కిడ్స్ తెలుగులో మాట్లాడటానికి రానట్లుగా చాలా ఓవర్ చేస్తూ ఉంటారు.కానీ బన్నీ అన్న కూతురు మాత్రం తెలుగులో అదరగొడుతుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.