కాంతారా సినిమా చుసిన వారందరికి ఒంటి చేత్తో సినిమాను మోసిన రిషబ్ శెట్టి మాత్రము గుర్తుకు వస్తాడు.అయితే ఒక్కడితో సినిమా పూర్తవ్వదు.
ఒక వ్యక్తి అల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అంటే అతడి చుట్టూ ఉండే నటీనటులు తోడ్పాటు తప్పని సరి.ఇక కాంతారా సినిమా చుసిన ప్రతి ఒక్కరికి రిషబ్ శెట్టి తర్వాత బాగా గుర్తుండిపోయే పాత్ర దైవ ది.పులి లాంటి చూపుతో సినిమాను రక్తి కట్టించాడు.ఈ కళ్ళను చూసినవారెవ్వరు అతడిని అంత ఈజీ గా మర్చిపోరు.
ఇలాంటి పాత్రలన్నీ కలిస్తేనే కాంతారా ప్రాణం పోసుకుంది.ఇక దైవ పాత్రలో నటించిన వ్యక్తి పేరు నవీన్ బొండె.
దైవ పాత్ర లో నవీన్ నటించడానికి చాల పెద్ద తతంగమే నడించింది.
నవీన్ సినిమాల్లోకి రాక ముందు మంగుళూరు లో ఒక కండక్టర్ గా పని చేసేవాడు.
కాంతారా సినిమా టీమ్ అంత కూడా మంగుళూరు వాస్తవ్యులు కావడం కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అయ్యింది.మొదట్లో నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు.
పొట్ట పోసుకోవడానికి టెక్నీకల్ టీమ్ లో కూడా అనేక పనులు చేసేవాడు.ఆ తరువాత మెల్లిగా తుళు భాషలో విలనీ వేషాలు కూడా వేసాడు.
తుళు బాషా సినిమాల రీచ్ చాల తక్కువ.వాటి బడ్జెట్ అలాగే వసూళ్లు కూడా తక్కువే; కాంతారా సినిమాలో దైవ పాత్ర కోసం టీమ్ ఒక వ్యక్తిని వెతుకుతున్నారని నవీన్ కి తెలిసింది.
దాంతో ఎలాగైనా ఆ సినిమాలో అవకాశం సంపాదించాలని అనుకున్నాడు.
తెలిసిన వారి ద్వారా ఒక వీడియో చేసి టీమ్ లో ఒక వ్యక్తికి పంపించాడు.నిప్పులు కక్కే ఆ కళ్ళను చూసి రిషబ్ అవకాశం ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు.అతడిని ఒక రోజు కాంతారా టీమ్ మెంబర్ ఒకరు పిలిపించి పాత్ర నీ కోసం సిద్ధం గా ఉంది కానీ నువ్వు మీసం తీసెయ్యాలి అని చెప్పగానే ఒప్పుకున్నాడు.
అలా నవీన్ కాంతారా సినిమాలో అవకాశం దక్కింది.అడవుల్లో షూటింగ్ ఉంటుంది.సిద్ధం గా ఉండు అంటూ చెప్పారు.ఇక అంత అనుకున్నట్టుగానే చింత నిప్పుల్లా మెరిసే ఆ కళ్ళతో షూటింగ్ పూర్తి చేసాడు.
రిషబ్ కి ఈ సినిమా ద్వారా ఎంత పేరు వచ్చిందో నవీన్ కూడా అంతటి పేరుకు అర్హుడే.