పనిగట్టుకుని మరీ వచ్చి వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి.అయితే మొటిమలు కొందరిలో చాలా త్వరగా తగ్గిపోతాయి.
కానీ కొందరిని మాత్రం ఓ పట్టాన వదిలిపెట్టవు.పైగా తీవ్రమైన నొప్పిని కలగ చేస్తుంటాయి.
దాంతో ఏం చేయాలో తెలియక.మొటిమలను ఎలా వదిలించుకోవాలో అర్థంగాక తీవ్రంగా మదన పడిపోతూ ఉంటారు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని ప్రయత్నిస్తే కేవలం రెండు రోజుల్లో మొటిమలను నివారించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కీర దోసకాయ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
అలాగే ఒక అలోవెరా ఆకును తీసుకుని లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర స్లైసెస్, అలోవెరా జెల్, పది తులసి ఆకులు, పది వేపాకులు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్నచోట మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకుని అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే ఎంతటి మొండి మొటిమలు అయినా రెండు రోజుల్లో మాయం అవుతాయి.పైగా మొటిమలు తాలూకు మచ్చలు ఏమైనా ఉన్నా క్రమంగా తగ్గుతాయి.
కాబట్టి, మొండి మొటిమలతో సతమతం అయ్యే వారు ఈ రెమెడీని పాటిస్తే మంచి రిజల్ట్ ను సొంతం చేసుకోవచ్చు.