పాపికొండల విహార యాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దాదాపు మూడు నెలల తర్వాత పర్యాటకం తిరిగి ప్రారంభం కానుంది.
ఈ మేరకు రెవెన్యూ అధికారులు అల్లూరి జిల్లా పోచమ్మ గండి వద్ద కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.అదేవిధంగా ట్రయల్ రన్ ను నిర్వహించారు.
పోచమ్మగండి వద్ద బోట్ల పర్యాటక ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నారు.గోదావరికి ఇటీవల వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బోటింగ్ ను అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే.
దీంతో పర్యాటకులు, టూరిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







