అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు.. అయ్యో పాపం అంటూ?

అక్కినేని నాగార్జున జాతకం ఈ మధ్య కాలంలో అస్సలు బాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నాగార్జున ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ ప్రాజెక్ట్ భారీగా లాభాలను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నసంగతి తెలిసిందే.

 Ap High Court Notices To Akkineni Nagarjuna Details Here Goes Viral , Akkineni N-TeluguStop.com

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్6 కు నాగార్జున హోస్ట్ కాగా ఈ సీజన్ దారుణంగా ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా నాగార్జునకు మరో షాక్ తగిలింది.

ఏపీ హైకోర్టు నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన కోర్టు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునకు నోటీసులను పంపింది.

ఈ షో నిర్వాహకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం హైకోర్టు నుంచి నోటీసులు దాఖలు అయ్యాయి.నోటీసులు అందిన వాళ్లు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కోరింది.

ఆ తర్వాత కోర్టు ఈ పిటిషన్ గురించి విచారణను 14 రోజులకు వాయిదా వేసింది.బిగ్ బాస్ షో నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

మరోవైపు నాగార్జున ఈ సీజన్ తర్వాత బిగ్ బాస్ షోకు దూరమయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ ఇప్పటికే 50 రోజులు పూర్తి కాగా డిసెంబర్ రెండో వారానికి ఈ సీజన్ పూర్తి కానుందని తెలుస్తోంది.

Telugu Ap, Ghost-Movie

నాగార్జునకు కోర్టు నుంచి నోటీసులు అందడంతో కొంతమంది అయ్యో పాపం అంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.నాగార్జున ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు.ది ఘోస్ట్ మూవీ నాగార్జునకు ఆర్థికంగా కూడా నష్టం కలుగుతోంది.నాగార్జున ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.జయాపజయాలతో సంబంధం లేకుండా నాగార్జున కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube