అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు.. అయ్యో పాపం అంటూ?

అక్కినేని నాగార్జున జాతకం ఈ మధ్య కాలంలో అస్సలు బాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాగార్జున ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ ప్రాజెక్ట్ భారీగా లాభాలను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నసంగతి తెలిసిందే.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్6 కు నాగార్జున హోస్ట్ కాగా ఈ సీజన్ దారుణంగా ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా నాగార్జునకు మరో షాక్ తగిలింది.ఏపీ హైకోర్టు నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.

బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన కోర్టు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునకు నోటీసులను పంపింది.

ఈ షో నిర్వాహకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం హైకోర్టు నుంచి నోటీసులు దాఖలు అయ్యాయి.

నోటీసులు అందిన వాళ్లు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కోరింది.ఆ తర్వాత కోర్టు ఈ పిటిషన్ గురించి విచారణను 14 రోజులకు వాయిదా వేసింది.

బిగ్ బాస్ షో నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.మరోవైపు నాగార్జున ఈ సీజన్ తర్వాత బిగ్ బాస్ షోకు దూరమయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బిగ్ బాస్ ఇప్పటికే 50 రోజులు పూర్తి కాగా డిసెంబర్ రెండో వారానికి ఈ సీజన్ పూర్తి కానుందని తెలుస్తోంది.

"""/"/ నాగార్జునకు కోర్టు నుంచి నోటీసులు అందడంతో కొంతమంది అయ్యో పాపం అంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

నాగార్జున ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు.ది ఘోస్ట్ మూవీ నాగార్జునకు ఆర్థికంగా కూడా నష్టం కలుగుతోంది.

నాగార్జున ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా నాగార్జున కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

ముంబై నటి వేధింపుల కేసు : వారిపై ‘సజ్జల’ పరువు నష్టం దావా