మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో మాస్ మహా రాజా రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
బాబీ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయి.దీపావళి సందర్భం గా వాల్తేరు వీరయ్య సినిమా నుండి టీజర్ వచ్చింది.
టీజర్ రిలీజ్ తర్వాత సినిమా పై అంచనాలను మెగా అభిమానులు విపరీతంగా పెంచేసుకుంటున్నారు.కొందరు ముఠామేస్త్రి లో చిరంజీవి మాదిరిగా వాల్తేరు వీరయ్య ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి మాదిరిగా వాల్తేరు వీరయ్య ఉన్నాడు అంటూ చర్చించుకుంటున్నారు.
మొత్తానికి వాల్తేరు వీరయ్యకు వింటేజ్ చిరంజీవి లుక్ ఇచ్చారని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ విజయాన్ని సొంతం చేసుకుని 100 కోట్లకు పైగా వసూలను నమోదు చేస్తుందని విశ్వాసంలో వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా గురించి ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది.భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమా ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఇప్పటికే నిర్ణయించారు.
అయితే అదే రోజున నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.కనుక బాక్సాఫీస్ వద్ద మెగా నందమూరి హీరోల యొక్క వార్ తప్పదు అంటూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి ఏమీ లేదు.ఈ ఇద్దరు హీరోలు వస్తే సంక్రాంతికి జాతర కాయం అంటూ సినీ ప్రేమికులు చాలా నమ్మకం తో ఉన్నారు.







