ఇండియన్స్ బ్లడ్ లోనే డాన్స్ ఉంది.. చిరంజీవి డాన్స్ పై ఎన్టీఆర్ కామెంట్స్?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 Dance Is In Indians Blood Ntrs Comments On Chiranjeevis Dance, Dance , Indians B-TeluguStop.com

ఈ సినిమా కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇకపోతే ఈ సినిమాని అక్టోబర్ 21వ తేదీ జపాన్ లో కూడా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

జపాన్ లో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించింది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ జపాన్ లో పర్యటిస్తున్నారు.

ఇలా జపాన్ లో పర్యటిస్తున్నటువంటి ఈ హీరోలు పెద్ద ఎత్తున పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

ఈ సందర్భంగా ఇండియన్ డాన్స్ గురించి ఎన్టీఆర్ కు ప్రశ్న ఎదురు కావడంతో ఎన్టీఆర్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.ఇండియన్స్ బ్లడ్ లోనే డాన్స్ ఉందంటూ ఎన్టీఆర్ సమాధానం చెప్పారు.

Telugu Chiranjeevi, Dance, Indians, Japan, Rajamouli, Ramcharan-Movie

ఇండియాలో చిన్నప్పటినుంచి అందరూ డాన్స్ లు నేర్చుకుంటారని, ఇండియాలో గొప్ప గొప్ప డాన్సర్ లో ఉన్నారంటూ ఎన్టీఆర్ తెలిపారు.ఇండియాలో చరణ్ వాళ్ళ నాన్న కూడా గొప్ప డాన్సర్ అలాగే ప్రభుదేవా అని ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారని ఆయనని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటూ అందరూ పిలుస్తామని ఈ సందర్భంగా చిరంజీవి డాన్స్ గురించి ఎన్టీఆర్ జపాన్ లో ఎంతో గొప్పగా చెప్పారు.ఇలా చిరంజీవి డాన్స్ పట్ల ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించడంతో చిరంజీవి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube