భలే భలే.. చార్జింగ్ పెట్టే అవసరంలేని కూల్ కూల్ బెడ్ షీట్లు గురూ...!

విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ రోజు రోజుకు ఆశ్చర్యపరుస్తూనే ఉంది.ప్రస్తుతం విద్యుత్‌ తో మన అవసరాలను తీర్చుకుంటున్నాం.

 Bed Sheets That Cool In Minutes Without Electrictiy New Technology Details, Char-TeluguStop.com

అయితే మొదట బొగ్గుతో తరువాత నీటితో ఆ తరువాత గాలీ సూర్యుడి నుండి కూడా మనం పవర్ ను ఉత్పత్తి చేసి అవసరాలకు వినియోగించుకుంటున్నాం.

సూర్యుడి నుండి విద్యుత్ ను తయారు చేసుకునే స్థాయికి ఎదిగినా.

విద్యుత్ అవసరాలకు బొగ్గును వాడుకోవడం ఆపలేదు.దీంతో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యంపై ఆందోళన మొదలైంది.

కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

అసలు విద్యుత్‌ అవసరమే లేకుండా పనులు జరిగిపోతే ఎలా ఉంటుందని.

కొన్ని దేశాల శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకుని కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.ఇలాంటి ఓఆలోచన నుండి పుట్టిన అద్భతాలే ఇప్పుడు మీ ముందు ఉన్నాయి

ఏసీ లేకుండానే ఇల్లు కూల్‌ చేసుకోవచ్చు.

ఇక విద్యుత్ బిల్లులకు చెక్ పెట్టోచ్చు.ఎలానో చదవండి.

దీని కోసం శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని సృష్టించారు.రేడియేటివ్‌ కూలర్‌ పూతను అందుబాటులోకి తెచ్చారు.

దీనిని ఇంటి పైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండా ఇంటి మొత్తాన్ని చల్లచల్లగా ఉంచుతుందని చెబుతున్నారు.

Telugu Bed Sheet, Bed Sheets Cool, Charge, Ups, Latest, Electrictiy-Latest News

భలే ఉంది కదా.ఇలాంటి విధానాలను పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌ అని పిలుస్తున్నారు.పరిసరాల్లోని వేడిని గ్రహించి దానిని పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేసే సాంకేతికత ఇందులో ఉంటుంది.

రేడియేటివ్‌ కూలర్‌ పూత కారణంగా ఇంట్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గుతాయట.

ఇక కరెంటు అక్కర్లేని ఏసీని చూసేద్దామా.

విద్యుత్‌ అవసరం లేకుండా ఏసీ పెట్టుకుని పరిసరాలను చల్లగా మార్చవచ్చంటోంది ఇజ్రాయెల్‌కు చెందిన కెన్షో కంపెనీ. ఈ కంపెనీ లిక్విడ్‌ నైట్రోజన్‌ ఆధారంగా పనిచేసే ఏసీని అభివృద్ధి చేసింది.

ఏసీలోని ప్రామాణిక ట్యాంకుల్లో ద్రవ నత్రజని -196 డిగ్రీల వద్ద ఫ్రీజ్‌ అయ్యి ఉంటుంది.ఇది గ్యాస్‌గా మారే క్రమంలో బలమైన ఒత్తిడిని కలగచేస్తుంది.

ఆ ఒత్తిడితో ఈ ఏసీ పనిచేస్తుంది.దీంతో ఆ పరిసర ప్రాంతం పూర్తిగా చల్లబడుతుంది.

ఈ ఏసీలకు ఇప్పటికే భారీగా ఆర్డర్లు కూడా వచ్చాయట.

ఏసీలా కూల్‌ చేసే బెడ్‌ షీట్లు కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయండో.

కూల్ కూల్ బెట్ షీట్స్ తక్కువ ధరకే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.వీటి ధర రూ.1,500 వరకు ఉంటుంది.కొన్ని ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో రూ.699కే లభిస్తోంది.ఇది జెల్‌ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది.

దీనిని ఉపయోగించిన నిమిషాల్లోనే మనకు చల్లదనాన్ని అందిస్తుంది.మురికిగా అయితే, దానిని పొడి గుడ్డతో సులువుగా శుభ్రం చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube