పవన్‌ కళ్యాణ్ యాత్రనా? హరి హర వీరమల్లు షూటింగ్‌నా?

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.అక్టోబర్ రెండవ వారం నుండి షూటింగ్ పునః ప్రారంభించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

 Pawan Kalyan Bus Yatra And Harihara Veeramallu Shooting Suspense Detals, Hari Ha-TeluguStop.com

కానీ దసరా నుండి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఉంటుంది అంటూ కొన్ని వారాల క్రితం జనసేన పార్టీ నాయకులు అధికారికంగా ప్రకటించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఇటీవలే ఒక మీడియా సమావేశంలో కూడా జనసేన నాయకులు అధికారికంగా తెలియజేశారు.

కానీ ఇప్పుడు జనసేన యాత్ర ఒక వైపు కొనసాగుతుండగానే మరో వైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరగబోతుంది అన్నట్లుగా మీడియా లో ప్రచారం జరుగుతుంది.

అది ఎలా సాధ్యం అనేది చాలా మందికి అనుమానంగా మారింది.

జరిగితే యాత్ర అయినా జరగాలి.లేదంటే హరిహర వీరమల్లు షూటింగ్ అయిన జరగాలి.

ఈ రెండు ఒకేసారి జరగడం అనేది దాదాపుగా అసాధ్యం.కనుక ఇందులో ఏదో ఒకటి అయినా పుకారు అయ్యి ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికలకు ఇంకా గడువు ఉన్న కారణంగా యాత్ర వచ్చే యేడానికి వాయిదా వేసే విషయమై పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో చర్చిస్తున్నాడని,

Telugu Krish, Harihara, Janasena, Nidhi Agarwal, Pawan, Pawan Bus Yatra, Pawan K

అందుకే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని దసరా తర్వాతి వారంలో మొదలు పెట్టి నెల రోజుల గ్యాప్ లోనే ముగించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ కి జోడిగా హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తోంది.ఆమెకు ఈ సినిమా ఎంతో కీలకంగా మారింది.ఈ సినిమా పై ఆమె ఎంతో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తోంది.త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమైతే వచ్చే ఎడాది ఏప్రిల్ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube