వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.విచారణలో ఏపీ సీఐడీ అధికారులు టార్చర్ చేశారనీ, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని రఘురామ కుమారుడు భరత్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది.
అయితే, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సీఐడీ కస్టడీలోని రఘురామరాజుపై టార్చర్ జరిగిందని భరత్ తరపు న్యాయవాది తెలిపారు.ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని వాదించారు.
ఈ వాదనలతో విభేదించిన ధర్మాసనం.ప్రభుత్వ వాదన విన్న తర్వాతే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలా? లేదా? అన్న విషయంపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది.ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చేందుకు రెండు వారాల గడువు కావాలని భరత్ తరపు న్యాయవాది కోరారు.అందుకు కోర్టు సమ్మతిస్తూ విచారణను వాయిదా వేసింది.