వినాయకుడు ముందు గుంజీలు తీయడం వెనుక అసలు రహస్యం ఇదే

వినాయక చవితి వచ్చేసింది.భాద్రపద శుద్ధ చవితి వినాయకుడి పుట్టిన రోజు సందర్భంగా ప్రతి వాడలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు.

 This Is The Real Secret Behind Taking Gunjis In Front Of Ganesha , Vinayaka , C-TeluguStop.com

దీంతో ప్రతి పల్లెలో వాడవాడన వినాయకుడిని నిలుపుకొని భక్తులందరూ ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించుకుంటారు.అయితే వినాయకుడిని పూజించే సమయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి.

అందులో ముఖ్యమైనది.గుంజీలు తీయడం.

ఎవరైతే వినాయకుడి పూజ చేస్తారో వారు తప్పనిసరిగా గుంజీలు తీస్తుంటారు.అయితే దీనివెనుక పెద్ద రహస్యమే ఉందంటున్నాయి పురణాలు.

అసలు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శివున్ని చూడటానికి శ్రీమహావిష్ణువు కైలాసానికి వెళ్తాడు.

అయితే విష్ణువు తన ఆయుధామైన సుదర్శన చక్రాన్ని పక్కకు పెట్టి శివునితో ముచ్చపెడుతుంటే, వినాయకుడు ధగ ధగలాడుతున్న సుదర్శనచ్రాన్ని తీసుకొని మింగేస్తాడు.ఆ తర్వాత విష్ణు దేవుడు నా సుదర్శన చక్రం కనిపించడం లేదంటూ చాలా వెతుకుతాడు.

అప్పుడు నిమ్మలంగా వినాయకుడు నేను మింగేసాగా అని చెప్తాడు.ఎంత బతిమిలాడినా ఇవ్వడు.

దీంతో అతన్ని ప్రస్నంచేసుకోవడానికి విష్ణువు గుంజీలు తీస్తాడు.విష్ణువు గుంజీలు తీస్తుంటే వినాయకుడి చాల నవ్వస్తుంది.

అలా పగలబడి నవ్వడంతో ఒక్కసారిగా సుదర్శన చక్రం బయటకు వచ్చేస్తుంది.అయితే అలా వినాయకుడికి గుంజీలు అంటే చాలా ఇష్టం.

ఏ భక్తుడైనా సరే తన వద్దకు వచ్చి గుంజీలు తీస్తే కోరిన కోర్కె నెరవేరుస్తారని భక్తుల నమ్మకం.అందుకే అప్పటి నుంచి భక్తులందరూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని.

ఎడమ చేత్తో కుడి చెవిని, కుడి చేత్తో ఏడుమ చేవిని పట్టుకొని గుంజీలు తీస్తూ తమ కోరిక నెరవేరాలని ఆ వినాయకుడిని కోరుకుంటారంట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube