1.నాట్స్ ఉపకార వేతనాలు
అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఏపీలోని గుంటూరు జిల్లా పెదనంది పాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించింది.
2.భారత మెడికల్ విద్యార్థులకు శుభవార్త
ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లి అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత్ కు వచ్చేసిన మెడికల్ విద్యార్థులను తిరిగి రావలసిందిగా ఉక్రెయిన్ ప్రభుత్వం ఆహ్వానం పంపింది.
3.శ్రీలంక కు భారత్ సాయం
ఆర్థిక భారంతో సతమతమవుతున్న శ్రీలంకకు భారత్ సహాయం కొనసాగిస్తూనే ఉంది.తాజాగా 21 వేల టన్నుల ఎరువులను భారత్ అందించింది.
4.కెనడాలో భారత్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
కెనడాలో భారత్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.కెనడాలోని టొరెంటో లోని నాథన్ పిలిప్స్ లో వైభవంగా జరిగింది.
5.ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలపై చైనా సైబర్ దాడులు
చైనాకు చెందిన రెడ్ ఆల్ఫా అనే హ్యాకింగ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, ఎన్జీఓ లు , న్యూస్ పబ్లికేషన్స్ , థింక్ ట్యాంక్ ల ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు దిగింది.
6.పరాగ్వే లో గాంధీ విగ్రహావిష్కరణ
దక్షిణ అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ , జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ను పరాగ్వే లో ఆవిష్కరించారు.
7.ఉగ్రవాద కేసులో ఇమ్రాన్ ఖాన్ కు అరెస్ట్ నుంచి రక్షణ
ఇస్లామాబాద్ లో జరిగిన ర్యాలీలో పోలీసులు, న్యాయవ్యవస్థ , ఇతర ప్రభుత్వ సంస్థలను బెదిరించినందుకు అతనిపై నమోదయిన ఉగ్రవాద కేసులో పాకిస్థాన్ బహుష్కృత నేత ఇమ్రాన్ ఖాన్ కు అరెస్ట్ నుంచి తప్పిస్తూ రక్షణ బెయిల్ మంజూరు చేసింది.