పెరిగిన టెక్నాలజీ మనిషికి ఎంతగానో ఉపయోగపడుతోంది.ఇపుడు చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.మీరు మునుపెన్నడూ వెళ్లని ప్రదేశాలకు గూగుల్ మ్యాప్స్ సహాయంతో వెళ్లిపోవచ్చు.అవును… మామూలుగా మనము ఏదైనా లొకేషన్ కు వెళ్లాలి అనుకుంటే గూగుల్ మ్యాప్ ద్వారా చాలా ఈజీగా చేరుకోవచ్చు.ఈ క్రమంలో తాజాగా గూగుల్ మ్యాప్ లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి విసుకు వచ్చింది.అదే స్ట్రీట్ వ్యూ ఫీచర్.ఈ ఫీచర్ గొప్పతనం ఏంటంటే తమకు కావలసినవి కనబడుతూ ఉంటాయి.
అంటే మనం వెళ్లే ఏరియాని జూమ్ చేసి చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కేఫ్ లు, ఇల్లు, వీధులు, సాంస్కృతిక కేంద్రాలు, హాస్పిటల్ ఇలా అక్కడ వున్న అనేక కేంద్రాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.
ఈ ఫీచర్ ద్వారా ఫలానా ప్రాంతం, ఫలానా వీధి అని స్పష్టంగా తెలుసుకోవచ్చు.దీంతో యూజర్లు తమ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి. ల్యాండ్ మార్కును ఖచ్చితంగా గుర్తించవచ్చు.అప్పుడు ఎటువంటి ఇబ్బంది, కన్ఫ్యూజన్ ఉండదు.
బేసిగ్గా మనం మొదటసారి ఈ గూగుల్ మ్యాప్స్ ని వాడినట్లైతే తడబాటు ఉంటుంది.
తాజా ఫీచర్ తో అలాంటి సమస్యలు వుండవు.
ఇక ఈ ఫీచర్ను గూగుల్ జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా కంపెనీలో భాగస్వామ్యంతో ముందుకు తీసుకొచ్చింది.ఇక ప్రస్తుతం ఈ ఫీచర్ బెంగళూరు వాసులకు అందుబాటులో ఉండగా.
త్వరలో హైదరాబాదు యూజర్ల కూడా అందుబాటులోకి రానుంది.ఇక ఇందులో ఫలానా రహదారిపై వాహనాలు వేగ పరిమితులు కూడా తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా మూసివేసిన రోడ్ల వివరాలను, ఇతర అవరోధాలను కూడా సులువుగా తెలుసుకోవచ్చు.