రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. భారీగా తగ్గనున్న కోచ్‌లు

రైలు ప్రయాణాన్ని చాలామంది ఇష్టపడతారు.దేశంలో ఎక్కువమంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు.

 Alert For Railway Passengers Coaches Will Be Heavily Reduced , Railway Station,-TeluguStop.com

సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ట్రైన్లలో ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు.ట్రైన్‌లో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

అందుకే ఎక్కువమంది రైలు ప్రయాణానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.రైల్వే ప్రయాణం అయితే చాలా ఎంజాయ్ కూడా చేయవచ్చు.

ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తే మరింతగా ఉల్లాసంగా ఉంటుంది.

అయితే రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం అనేక సంస్కరణలు తీసుకొస్తుంది.

కొత్తగా అనేక సదుపాయాలను కల్పిస్తుంది.అయితే ఇటీవల ఫ్లాట్‌ఫామ్ ఛార్జీలను పెంచిన రైల్వేశాఖ.

సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వివిధ అధికారాలను రద్దు చేసింది.అంతేకాకుండా దూరం వెళ్లే రైళ్లలో స్లీపర్ కోచ్ ల సంఖ్యను కూడా తగ్గించింది.

బాగా దూరం ప్రయాణించే రైళ్లలో 12 నుంచి 13 స్లీపర్ కోచ్ లు ఉంటాయి.అయితే స్లీపర్ కోచ్ ల సంఖ్యను 10కి తగ్గించారు.

దీంతో బెర్త్ ల సంఖ్య కూడా తగ్గింది.

దీని వల్ల దూరం ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది.

అయితే ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గించనుంది.ఇక స్లీపర్ కోచ్ ల సంఖ్యను తగ్గించి ఏసీ కోచ్ లను పెంచాలని రైల్వేశాఖ యోచిస్తోంది.

దీని వల్ల ఆదాయం పెంచుకోవచ్చని రైల్వేశాఖ భావిస్తోంది.ప్రస్తుతం రైళ్లలో స్లీపర్ కోచ్ లు 7 ఉంటున్నాయి.

వాటిని రెండుకు తగ్గించనున్న రైల్వేశాఖ.ఏసీ త్రీ టైర్ కోచ్‌లు 6 నుంచి 10కి, ఏసీ టూ టైర్ కోచ్ లు 2 నుంచి 4కి పెంచనుంది.

ఇక అన్ రిజర్వ్ డే కోచ్ లను మూడుకు పరిమితం చేయనుంది.అలాగే ఏేసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఒకటి పెంచనుంది.

త్వరలోనే ఈ ప్రతిపాదనలను రైల్వేశాఖ అమల్లోకి తీసుకొచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube