హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథ సప్తమిని జరుపుకుంటారు.దక్షిణ భారతములో ఈ రోజున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు.
ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసంలో వచ్చే సప్తమి బాగా విశిష్టమైనది.రథ సప్తమికి ముందు రోజున రాత్రి ఉపవాసం చేసి, మరునాడు అరుణోదయంతోనే స్నానం చేస్తే ఏడు జన్మలలోని పాపాలు అంతరిస్తాయి.
స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దానిని నెత్తి మీద పెట్టుకుని, సూర్యుని ధ్యానించి దీపాన్ని నీళ్లలో వదలి స్నానంచేయాలి.స్నానం చేసేటప్పుడు… జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగు పళ్ళు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయాలి.
స్నానం చేసిన తర్వాత “జననీ త్వంహి లోకానాం సప్తమీ సప్త సప్తికే సప్తమ్యా హ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే” అన్నశ్లోకం చదివి సూర్యునికి అర్ఘ్యమిచ్చి ధ్యానం చేయాలి.తర్వాత పితృ తర్పణం చేసి (తల్లితండ్రులు లేని వారు) చిమ్మిలిని దానం ఇవ్వాలి.
వ్రతానికి మాఘ శుద్ధ షష్ఠి నాడు అంటే రథ సప్తమి ముందు రోజున తెల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.బంధువులతో కలసి నూనె లేని వంటకాలతో భోజనం చేయాలి.
రాత్రి ఉపవాసం ఉండాలి.వేద పండితులను సూర్య రూపులుగా భావించి సత్కరించాలి.
రాత్రి నేల మీద నిద్రించాలి.గురువుకు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.
ఈ వ్రతం వల్ల సూర్య గ్రహ దోషాలు అంతరిస్తాయి.జీర్ణ కోశ, నేత్ర, దంత, ఉష్ణ సంబంధమైన రుగ్మతలు, రక్తపోటు వంటివి తగ్గుతాయి.