పవన్ పై '  ప్యాకేజీ ' కామెంట్స్ ! వైసీపీ యుద్ధం మొదలయ్యిందిగా ..?

పొత్తుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవ్వడంతో ఆయన పై రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి.ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు ఈ వ్యవహారంలో పవన్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 Ysrcp Mla Malladi Vishnu Comments On Pavan Kalyan Behaviour Ysrcp, Ap, Ap Govern-TeluguStop.com

వాస్తవంగా 2019 ఎన్నికల తరువాత నుంచి జనసేన ను టార్గెట్ చేసుకుంటూ వైసిపి ఎన్నో రకాల విమర్శలు చేసింది .తెలుగుదేశం పార్టీతో పవన్ పొత్తు పెట్టుకుంటారని, ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని , ఒంటరిగా పోటీ చేసే సత్తా జనసేన కు లేదని ఎన్నో కామెంట్ చేశారు.ఇప్పుడు ఆ కామెంట్స్ నిజమే అనే పరిస్థితి ఉండడంతో,  వైసీపీ నాయకులు మరింతగా విమర్శలు తీవ్రతరం చేశారు.

       తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పవన్ తీరుపై విమర్శల వర్షం కురిపించారు.

టిడిపితో పొత్తు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ మల్లాది విష్ణు కామెంట్స్ చేశారు.పవన్ చెబుతున్న మూడు ఆప్షన్ లు అంటే  ప్యాకేజీ 1, ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 అని అర్థం ఉంటూ మల్లాది విష్ణు సెటైర్లు వేశారు.

పవన్ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బలం ఏమిటో బయటపడ్డాయని, పవన్ ఆప్షన్ చెప్పడం అంటే బలహీనంగా ఉన్నారని అర్థం అంటూ విష్ణు వ్యాఖ్యానించారు.టీడీపీతో పొత్తు కోసం జనసేన ప్రయత్నాలు చేస్తుండటం చూస్తుంటే ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయలేము అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారని విష్ణు అన్నారు.
   

Telugu Ap, Jagan, Janasenatdp, Ysrcp-Politics

   చంద్రబాబు కన్ను కొట్టి పిలిచినా, చప్పట్లు కొట్టి పిలిచినా,  అసలు పిలవకపోయినా వెళ్లేలా పవన్ వ్యవహార శైలి ఉంది అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు.వైసీపీని ఎదుర్కొనేందుకు మహాకూటమి తో కలిసి వెళ్ళాలి అనుకోవడం వారి అవివేకానికి , వెర్రి తనానికి నిదర్శనం అంటూ విష్ణు మండిపడ్డారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube