నారాయణ అరెస్ట్ తో వైసీపీ నేతల ప్లాన్ సక్సెస్?

టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‎లో నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు.

 Ycp Leaders Plan Success With Narayanas Arrest , Former Minister Narayana , Y-TeluguStop.com

ఏపీకి తీసుకువెళ్తున్నాయి.అయితే నారాయణ అరెస్ట్ కేసు విషయంలో కొంత గందరగోళం నెలకొంది.

పేపర్ లీకేజ్ కేసులోనా.అమరావతి ల్యాడ్ పూలింగ్ కేసులోనా అనే దానిపై అమోమయ పరిస్థితి నెలకొంది.

చివరకు ల్యాండ్ పూలింగ్ కేసులోనే నారాయణను అరెస్ట్ చేసినట్లు స్పష్టత వస్తోంది.

కాగా ఏపీ రాజధాని అమరావతికి ల్యాండ్ ఫూలింగ్ విధానంలో రైతులతో పాటు కొంతమంది స్థానికుల నుంచి భూములు స్వీకరించారు.

ఆ సమయంలో నారాయణ మంత్రిగా పని చేశారు.అయితే ల్యాండ్ పూలింగ్ పేరుతో నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు భాగంగాలో నారాయణను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఇదే కేసులో చంద్రబాబు పేరును కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్తో భేటీ అయ్యి నారాయణ అరెస్ట్ అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.ఏపీలో టెన్త్క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజీల వ్యవహారంలో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ కేసులో అధికార, ప్రతిపక్షాల నేతలు నిత్యం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.టీడీపీ నేతలకు చెందిన విద్యాసంస్థల వల్లే ప్రశ్నాపత్రాలు లీకైనట్లు అధికారు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తుంటే.

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతోనే అయ్యాయని.చర్యలు తీసుకోలేని అసమర్థ యంత్రాంగం తమపై ఆరోపణలు చేస్తుందని టీడీపీ నేతలు ప్రత్యరోపణ చేశారు.

Telugu Amravati Lad, Ap Cid, Chandrababu, Cm Jagan, Yana, Hyderabad, Mangalagiri

నారాయణపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.రాజధాని ల్యాండ్ పూలింగ్లో అక్రమాలు జరిగాయంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో నిన్న ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ నారాయణపై 120బి, 420, 34, 35, 37, 166 సెక్షన్ల కింద కేసు నమోదైంది.అయితే ల్యాండ్ పూలింగ్ కేసులో ఏ1గా చంద్రబాబును ఏ2 నారాయణ, ఏ3 లింగమనేని రమేష్, ఏ4 లింగమనేని శేఖర్, ఏ5 అంజనీకుమార్, ఏ6 హెరిటేజ్ ఫుడ్స్ తో పాటు ఎఫ్ఐఆర్లో మొత్తం 14 మంది పేర్లను చేర్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube