కెనడా : భారత సంతతి బాలుడి హత్య... నిందితులు ఆరుగురు మైనర్లు, కేసు నమోదు

ఈ నెల ప్రారంభంలో జరిగిన 16 ఏళ్ల ఇండో కెనడియన్ విద్యార్ధిని హత్య చేసినందుకు ఆరుగురు మైనర్లపై అభియోగాలు మోపినట్లు కెనడాలోని ఎడ్మంటన్ పోలీసులు వెల్లడించారు.అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్ నగరంలో ఏప్రిల్ 8న ఈ హత్య జరిగింది.

 Police Charge Six Minors For Murder Of Indo-canadian Student , Indo-canadian, Al-TeluguStop.com

బాధితుడు, నిందితులంతా మైనర్లు కావడంతో వారికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదు.అయితే సీబీసీ న్యూస్ అభ్యర్ధనపై న్యాయమూర్తి అనుమతి మేరకు బాధితుడి పేరు కరణ్‌వీర్ సహోటాగా తెలిపారు పోలీసులు.

ఏప్రిల్ 8న మధ్యాహ్నం 2.44 గంటకు ఎడ్మంటన్ నగరంలోని మెక్‌నాలీ హైస్కూల్ వెలుపల కరణ్‌వీర్‌పై దాడి జరిగింది.దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న విద్యార్ధికి పారామెడికల్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.దాదాపు వారం పాటు మృత్యువుతో పోరాడిన కరణ్‌వీర్ ఏప్రిల్ 15న తుదిశ్వాస విడిచాడు.దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Telugu Indo Canadian, Mcnally School, Chargeminors-Telugu NRI

బుధవారం ఎడ్మింటన్ మెడికల్ ఎగ్జామినర్ పోస్ట్‌మార్టం పూర్తి చేసి.ఛాతీపై కత్తిపోటు కారణంగానే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని నివేదిక ఇచ్చారు.దీనిపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.బాధితుడు, అనుమానితులు ఒకరికొకరు తెలుసునని చెప్పారు.నగరంలో ఈ తరహా ఘటనలు జరగడం ఇదే మొదటిసారని పోలీసులు తెలిపారు.

మరోవైపు .ఈ విపత్కర పరిస్ధితుల్లో బాధితుడి కుటుంబానికి అండగా వుండేందుకు బంధువులు ఆన్‌లైన్‌లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టారు.బాధితుడి తండ్రి దీర్ఘకాలిక వైకల్యంతో బాధపడుతున్నారు.

కొడుకు లేడన్న బాధతో అతని తల్లి ఇంకా విషాదం నుంచి తేరుకోలేదు.ఈ క్రమంలోనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టి ఇప్పటి వరకు 2,30,000 కెనడా డాలర్లను సేకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube