కెనడా : భారత సంతతి బాలుడి హత్య... నిందితులు ఆరుగురు మైనర్లు, కేసు నమోదు

ఈ నెల ప్రారంభంలో జరిగిన 16 ఏళ్ల ఇండో కెనడియన్ విద్యార్ధిని హత్య చేసినందుకు ఆరుగురు మైనర్లపై అభియోగాలు మోపినట్లు కెనడాలోని ఎడ్మంటన్ పోలీసులు వెల్లడించారు.

అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్ నగరంలో ఏప్రిల్ 8న ఈ హత్య జరిగింది.బాధితుడు, నిందితులంతా మైనర్లు కావడంతో వారికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదు.

అయితే సీబీసీ న్యూస్ అభ్యర్ధనపై న్యాయమూర్తి అనుమతి మేరకు బాధితుడి పేరు కరణ్‌వీర్ సహోటాగా తెలిపారు పోలీసులు.

ఏప్రిల్ 8న మధ్యాహ్నం 2.44 గంటకు ఎడ్మంటన్ నగరంలోని మెక్‌నాలీ హైస్కూల్ వెలుపల కరణ్‌వీర్‌పై దాడి జరిగింది.

దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న విద్యార్ధికి పారామెడికల్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.

దాదాపు వారం పాటు మృత్యువుతో పోరాడిన కరణ్‌వీర్ ఏప్రిల్ 15న తుదిశ్వాస విడిచాడు.

దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. """/" / బుధవారం ఎడ్మింటన్ మెడికల్ ఎగ్జామినర్ పోస్ట్‌మార్టం పూర్తి చేసి.

ఛాతీపై కత్తిపోటు కారణంగానే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని నివేదిక ఇచ్చారు.దీనిపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.

బాధితుడు, అనుమానితులు ఒకరికొకరు తెలుసునని చెప్పారు.నగరంలో ఈ తరహా ఘటనలు జరగడం ఇదే మొదటిసారని పోలీసులు తెలిపారు.

మరోవైపు .ఈ విపత్కర పరిస్ధితుల్లో బాధితుడి కుటుంబానికి అండగా వుండేందుకు బంధువులు ఆన్‌లైన్‌లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టారు.

బాధితుడి తండ్రి దీర్ఘకాలిక వైకల్యంతో బాధపడుతున్నారు.కొడుకు లేడన్న బాధతో అతని తల్లి ఇంకా విషాదం నుంచి తేరుకోలేదు.

ఈ క్రమంలోనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టి ఇప్పటి వరకు 2,30,000 కెనడా డాలర్లను సేకరించారు.

అంబానీ నుంచి జయలలిత వరకు గొప్పగా పెళ్లిళ్లు చేసి కష్టాలు కొనితెచ్చుకున్నారు