నా భూమి కబ్జా కి గురైంది అంటూ మీడియా సమావేశంలో పాల్గొన్న కల్వకుంట్ల రమ్య రావు.

2009లోనే తనకు దాదాపు ఏడు కోట్ల ఆస్తులు ఉన్నట్టు 2018 ఎన్నికల అఫిడవిట్లో జోగినిపల్లి సంతోష్ పెట్టడం జరిగింది అని2015 లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిడ్మానేరు కింద ఉన్న ముంపు గ్రామాల్లో తాను ఒక గ్రామస్థుడు గా 242 గజాల జాగా అంటే దాదాపు రెండు గుంటల భూమి పట్టా తీసుకున్నాడు అని మరి ఇదే సంతోష్ 2013లో గ్రానైట్ పార్ట్నర్షిప్ తీసుకోవడం జరిగింది అని దీనికి సంబంధించిన ఆధారాలు కాగితాలు తన దగ్గర ఉన్నవి అని రాజ్యాంగ పరంగా రాజ్యసభకు ఎన్నికైన ఈ వ్యక్తి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనధికారికంగా వెనుకబడ్డ వర్గాలు తాను బీసీనని చూపిస్తూ ఇక్కడ ముంపు ప్రాంతం కింద 242 గజాల స్థలం నుండి మొదలుపెట్టి కోకాపేట్ లో రెండు వందల ఎకరాల వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆక్రమించుకున్నాడు అని కల్వకుంట్ల రమ్య రావు అనే తనకు ఎలగందల గ్రామంలో రెండు ఎకరాల స్థలం ఉంది అని ఆ స్థలం ప్రక్కకు సంతోష్ పార్ట్నర్ షిప్ లో ఉన్న క్వారీ ఉంది అని తాను ఈ స్థలాన్ని 2007లో కొనుగోలు చేయడం జరిగింది అని 2013లో ఈ క్వారీలు మొదలు పెట్టి నా స్థలాన్ని కొంచెంకొంచెంగా మొత్తం ఆక్రమించి ఇప్పుడు నా భూమిలో వ్యర్ధపదార్ధాలు నింపేసి తీయకుండా తనను ఇబ్బంది పెడుతూ ఎలాంటి పనులు చేసుకోకుండా చేస్తున్నాడు

 Kalvakuntla Ramya Rao Participated In The Media Conference, Said That My Land H-TeluguStop.com

ఎలక్షన్స్ అఫిడవిట్లో రాజ్యసభ సభ్యునిగా అయ్యే ముందు 2009లోనే ఏడు కోట్ల ఆస్తులు చూపించి ఈరోజు వేల కోట్లు ఆస్తులు ఎలా సంపాదించారు అనే విషయం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కి తెలియకుండానే జరుగుతుందా అని లేక అంతా తెలిసినా ఏమీ చేయలేని ధృతరాష్ట్రుడు గా మారారా అంటూ ఎద్దేవా చేసారు.తక్షణమే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మరియు కేటీఆర్ గారు స్పందించి ఎవరైతే ఇలా క్వారీల పేరుమీద స్థలాలను అమాయకుల భూములను ఆక్రమించుకుని భౌతిక దాడులకు దిగుతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్న ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియా అనేది సంతోష్ అండదండలతో అక్రమంగా భూములు ఆక్రమణ చేస్తూ ఈరోజు ప్రభుత్వం ని సైతం కుల దోస్తాము శాసిస్తాము అనే లాగా గ్రానైట్ మాఫియా తయారు అయ్యింది అంటే దీనికి కారణం జోగినిపల్లి సంతోష్ అనేది స్పష్టం అని తెలియజేశారు.

ఎలగందుల గ్రామంలో చెరువులు సైతం కబ్జాలకు గురి అవుతున్నాయి అని తన ఒక్క స్థలమే కాక ఎంతో మంది స్థలాలు కబ్జాకు గురయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష కోట్ల అప్పులు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కడుతూ ఉంటే ఇలాంటివారు చెరువులను భూములను కబ్జా చేస్తున్నారు అని నాలాంటి బాధితులు వందల మంది ఉన్నారు అని ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి అన్యాయంగా పన్నులు ఎగవేస్తూ కబ్జాలు చేస్తున్న క్వారీ ఓనర్ల లైసెన్సులు లీజులు తక్షణమే రద్దు చేయాల్సిందిగాతన భూమికి సంబంధించి సర్వే విభాగంతో సర్వే చేయించాను అని అక్రమంగా ఆక్రమించారని ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది అని చార్జిషీటు కూడా దాఖలు చేసిన సంబంధిత కబ్జాదారులకు ఎలాంటి భయం లేకుండా యదేచ్చగా కబ్జాలకు పాల్పడుతున్నారు అని కావున ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి తమలాంటి వాళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube