భగవంతునికి భోగం ఎందుకు సమర్పిస్తారో తెలుసా?

మనం ఆహారం తీసుకునే ముందు భగవంతుడికి భోగం సమర్పించాలని అనేక గ్రంథాలలో పేర్కొన్నారు.దీనికి మతపరమైన ఆధారం మాత్రమే కాకుండా శాస్త్రీయ ఆధారం కూడా ఉంది.

 Why Do We Offer God , God , Jagadguru Shankaracharya , Laddu-TeluguStop.com

ఒకసారి ఒక మతపరమైన కార్యక్రమం జరుగుతుండగా ఒక వ్యక్తి జగద్గురు శంకరాచార్యను ఇలా అడిగాడు.మనం భగవంతుడికి ఆహారం ఎందుకు సమర్పించాలి? మనం భగవంతునికి ఏదైనా నైవేద్యంగా సమర్పిస్తే దేవుడు తింటాడా? తాగుతాడా? ఇది మూఢనమ్మకం కాదా?.జగద్గురు శంకరాచార్య ఆ వ్యక్తి ప్రశ్న ప్రశాంతంగా విన్నారు.ప్రశాంతమైన మనసుతో ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానమిచ్చారు.మనం భగవంతుడికి భోగాన్ని సమర్పించినప్పుడు దాని నుండి భగవంతుడు ఏమి తీసుకుంటాడో నువ్వు తెలుసుకోవాలి.ఉదాహరణకు నువ్వు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి లడ్డూలతో గుడికి వెళుతున్నావనుకుందాం.

దారిలో నీకు తెలిసిన ఎవరైనా ఇదేమిటి? అని అడిగారనుకోండి.అది లడ్డూ అని మీరు చెబుతారు.

అప్పుడు అవతలివారు అది ఎవరిది అని అడుగుతారు.దీపిరి మీరు నాది అని సమాధానం చెబుతారు.

ఆ తర్వాత అదే మిఠాయిని స్వామివారి పాదాల చెంత ఉంచి నైవేద్యంగా పెట్టి ఇంటికి తీసుకెళ్తుంటే.ఇంతకు ముందు కనిపించిన వ్యక్తి ఎదురై మళ్లీ ఇదేమిటి? అని అడిగాడనుకుందాం.అప్పుడు మీరు దానిని భగవంతుని ప్రసాదం అని చెబుతారు.ఇప్పుడు దీనిలో అర్థమయ్యే విషయం ఏమిటంటే.లడ్డూలోని రంగు, రూపం, రుచి, పరిమాణంలో తేడా లేదు.కాబట్టి భగవంతుడు ఏమి తీసుకున్నాడో తెలియదు.

కానీ దాని పేరు మారిపోయింది.భగవంతుడు మనిషిలోని మమకారాన్ని తీసివేస్తాడు.

ఇది నాది అనే భావన అహంకారానికి చిహ్నం.అది భగవంతుని పాదాల చెంత లొంగిపోగానే తనదేమీ లేదనే భావన మనిషికి కలుగుతంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube