మళ్ళీ అధికారంలోకి రావడమే జగన్ టార్గెట్

ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్ధీకరణ నేపథ్యంలో మంత్రులంతా రాజీనామాలు చేశారు.అయితే బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, అవంతి శ్రీనివాస్, కన్నబాబులు భేటీ కావడం కలకలం రేపింది.

 Jagan's Target Is To Come To Power Again , Vanitha, Avanti Srinivas, Kannababu ,-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే తమ టార్గెట్ అని బొత్స స్పష్టం చేశారు.

మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి జగన్‌కు పూర్తి స్వేచ్ఛ వుందని.

ఎవరినీ కొనసాగించాలన్నది ఆయన ఇష్టమన్నారు.దేవుడి దయ వుంటే మళ్లీ 24 మందిలో వుంటానని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు.

జగన్ నిర్ణయాన్ని అందరూ ఆనందంగా ఆమోదించారని.ఆయన ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తామని బొత్స తెలిపారు.

మంత్రులందరం సంతోషంగా రాజీనామా చేశామని మంత్రి తెలిపారు.పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని సత్యనారాయణ వెల్లడించారు.

అంతకుముందు పాత కేబినెట్‌లోని ఐదారుగురు మంత్రులు కొత్త మంత్రివర్గంలోనూ కొనసాగుతారని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు.జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటామని నాని పేర్కొన్నారు.

అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తామని సీఎం అన్నారని కొడాలి నాని తెలిపారు.అయితే ఎవరిని కొనసాగిస్తామనే వారి పేర్లను సీఎం చెప్పలేదని నాని స్పష్టం చేశారు.

కొత్త కేబినెట్‌లో నేను వుంటే అవకాశాలు తక్కువని ఆయన పేర్కొన్నారు.కొడాలి నాని వ్యాఖ్యలతో ఆ ఐదుగురు మంత్రులు ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

ఇకపోతే.కేబినెట్ సమావేశంలో జగన్ సరదాగా మాట్లాడారు.వెయ్యి రోజులు తన కేబినెట్‌లో వున్నారని… ఇక పార్టీ కోసం మీ సేవలు వినియోగించుకుంటానని చెప్పారు.చంద్రబాబును మరోసారి ఓడించే బాధ్యత మీదేనని సీఎం పేర్కొన్నారు.

కేబినెట్ మీటింగ్ ప్రారంభానికి ముందుకు ఖాళీ లెటర్ హెడ్లపై రాజీనామా లేఖలు తయారు చేశారు ప్రోటోకాల్ అధికారులు.చివరిలో రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు మంత్రులు.11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా జగన్ కోరారు.

Telugu Avanti Srinivas, Jagan, Jagans Target, Kannababu, Kodali Nani, Vanitha-Po

ముందుగా అనుకున్న విధంగానే ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో మంత్రులంతా తమ పదవులకు రాజీనామా చేశారు.సీఎం జగన్‌కు రాజీనామా లేఖలు సమర్పించారు.తామంతా రాజీనామాలు చేశామని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

రాజీనామా లేఖలు సీఎం అందజేశామని చెప్పారు.గతంలో ముఖ్యమంత్రి చెప్పినట్లే రాజీనామా చేసినట్లు వెల్లంపల్లి పేర్కొన్నారు.

మాజీలు అయినవారిని పార్టీ కోసం పనిచేయమని జగన్ సూచించినట్లు అవంతి తెలిపారు.మంత్రి వర్గంలో ఎవరుంటారన్నది చెప్పలేదని శ్రీనివాస్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube