అక్కడి పులులతో సన్యాసుల ఆటలు.. ఎక్కడంటే..

మీకు పులుల గురించి ఆసక్తి ఉంటే, పులులను దగ్గరగా చూడాలనుకుంటే అక్కడకు వెళ్లి వాటితో ఆడుకోండి.వాటితో నిర్భయంగా ఫోటోలు తీసుకోండి.

 Tiger Temple Thailand, Tiger , Tiger Temple , Thailand, Birds,-TeluguStop.com

ఇందుకోసం మీరు టైగర్ టెంపుల్ ఆఫ్ థాయ్‌లాండ్ వెళ్లాలి .టైగర్ టెంపుల్ థాయ్‌లాండ్‌లోని కాంచనబురి ప్రావిన్స్‌లో ఉంది.ఇది థాయ్‌లాండ్-బర్మా సరిహద్దుకు సమీపంలో ఉంది.దీనిని ‘వాట్ పా లుయాంగ్ టా బువా‘ అని కూడా అంటారు.ఈ దేవాలయం విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.టైగర్ టెంపుల్ నిజానికి ఒక బౌద్ధ దేవాలయం.

ఇది 1994లో నిర్మించారు.ఈ ఆలయ స్థాపనతో బౌద్ధ సన్యాసులు దీనిని వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమంతో ముడిపెట్టారు.మొదట్లో కొన్ని చిన్న చిన్న అడవి జంతువులు, పక్షులు మాత్రమే ఉండేవి.1999లో గ్రామీణ అడవి నుంచి తీసుకొచ్చిన పులి పిల్ల మొదటిసారిగా ఇక్కడికి వచ్చింది.

దాని తల్లిని వేటగాళ్లు చంపేశారు.థాయ్‌లాండ్‌లో జంతువులను అక్రమంగా వేటాడుతుంటారు.కాగా ఆలయానికి తీసుకు వచ్చిన తొలి పులిపిల్ల ఎక్కువ కాలం బతకలేదు.అయితే ఆ తర్వాత అనాథ పులి పిల్లలను గ్రామస్థులు ఈ ఆలయానికి తీసుకురావడం ప్రారంభించారు.

క్రమంగా ఈ ఆలయంలో పులుల సంఖ్య పెరిగింది.ఈ విధంగా ఆలయం పేరు టైగర్ టెంపుల్ అయ్యింది.

ప్రస్తుతం ఇక్కడ దాదాపు 150 పులులు ఉన్నాయి.ఈ పులులు బౌద్ధ సన్యాసుల దగ్గర శిక్షణ పొందాయి.

అవి మనుషులతో కలిసిపోతాయి.ఎవరికీ ఎటువంటి హాని కలిగించవు.

టైగర్ టెంపుల్‌ని సందర్శించే పర్యాటకులు ఈ పులులతో ఆడుతూ ఫోటోలు తీసుకుంటారు.ఈ ఆలయం థాయ్‌లాండ్‌లో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది.

ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.ఇప్పటి వరకు ఇక్కడున్న పులులు ఎవరికీ హాని కలిగించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube