చాలామంది ఏదైనా పామును చూస్తే హడలిపోతారు.కొంత కాలానికి అలాంటి పాము ఇంకెక్కడైనా కనిపిస్తే ఆందోళన చెందుతారు.
పాములు తమ మీద పగబట్టాయని బెంబేలెత్తిపోతారు.అయితే ఇలాంటి వాటికి శాస్త్రీయమైన ఆధారమేదీ లేదని చాలా మంది సైన్స్ నిపుణులు కొట్టి పారేస్తుంటారు.
అయితే అక్కడక్కడా మనకు కనిపించే కొన్ని సంఘటనలు చూస్తే మాత్రం ఖచ్చితంగా పాములు పగబడతాయని తెలుస్తోంది.
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా అవుసా పట్టణంలో అనిల్ తుకారాం గైక్వాడ్ అనే వ్యక్తి నివసిస్తుంటాడు.
రోజువారీ వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు.అయితే అతడి జీవితంలో ఓ ఆసక్తికర అంశం ఉంది.
అది నిత్యం అతడి ప్రాణాలకు ముప్పుగా మారింది.గత 15 ఏళ్లలో 500ల సార్లు అతడు పాముకాటుకు గురయ్యాడు.
పొలాల్లో పనిచేస్తున్నప్పుడు పాము కాటు వేశాయంటే అనుకోవచ్చు.కానీ జనసమూహంలో ఉన్నప్పుడు కూడా అతడు చాలా సార్లు పాముకాటుకు గురయ్యాడు.
దాదాపు 500ల సార్లు పాముకాటుకు గురవడంతో అతడిపై పాములు పగబట్టాయని స్థానికులు భావిస్తున్నారు.అన్ని సార్లు పాముకాటుకు గురైనా ఆ వ్యక్తి ప్రాణాలను డాక్టర్లు నిలబెట్టారు.తక్షణమే వైద్యుల వద్దకు వెళుతుండడంతో ప్రాణాపాయం తప్పుతోంది.అయితే జనావాసాల్లో ఉన్నప్పుడు కూడా కేవలం ఇతడినే టార్గెట్ చేసినట్లు పాములు కాటు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అసలు ఎందుకు ఇలా జరుగుతోందని డాక్టర్లు సైతం నివ్వెరబోతున్నారు.పాములు పగబట్టవని చెప్పే డాక్టర్లు సైతం ఇతడి విషయంలో డైలమాలో పడుతున్నారు.