అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఏడాదికి కోట్లు అర్జిస్తున్న 7ఏళ్ల చిన్నారి..!

చిన్నతనంలో ఎవరికైనా ఆడుకోవడమే తెలుసు.ఇక ఏడేళ్ల వయసంటే కనిపించిందల్లా తమకు కొనమని మారాం చేస్తుంటారు.

 7 Years Old Russian Girl Earning Crores Inspiration To Others Details, Viral Lat-TeluguStop.com

ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకుంటుంటారు.ఏదైనా అనారోగ్యంతో బాధపడే చిన్నారులైతే ఓ మూలన కూర్చుని ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

అయితే ఓ చిన్నారి మాత్రం తన ఆరోగ్య సమస్యను బట్టి చింతించలేదు.పైగా దానిని వరంగా మార్చుకుంది.

ఏడేళ్ల వయసులోనే కోట్ల డబ్బులు అర్జిస్తూ ఔరా అనిపిస్తోంది.

రష్యాకు చెందిన ఏడేళ్ల బాలిక అనస్తాసియా రాడ్జిస్కాయ ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్.

ఎందుకంటే 2021లో యూట్యూబ్ నుంచి అత్యధిక ఆదాయం పొందిన బాలికగా ఆమె నిలిచింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 యూట్యూబ్ ఛానళ్లను ఏకకాలంలో రన్ చేస్తోంది.ఇక లైక్ నాస్త్య అనే పేరు ఉన్న ఈమె యూట్యూబ్ ఛానల్‌కు 8.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.మొత్తం ఆమె యూట్యూబ్ ఛానళ్లన్నింటికీ కలిపి 26 కోట్లకు పైగానే సబ్‌స్క్రైబర్లు ఉండడం విశేషం.

యూట్యూబ్ స్టార్ అయిన అనస్తాసియాకు చిన్నప్పుడే ఏదో అనారోగ్య సమస్య ఉందని తల్లిదండ్రులు గ్రహించారు.

డాక్టర్లకు చూపిస్తే సెరిబ్రల్ పాల్సీ అనే న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు వారు చెప్పారు.

Telugu Russian, Cerebral Palsy, Nastya, Toy Reviews-Latest News - Telugu

అయితే తమ చిన్నారి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ తీసుకున్నారు.తమ ఉద్యోగాలను విడిచిపెట్టి ఆమె సంరక్షణకే తమ సమయం కేటాయించారు.ఆమెకు ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కింద లైక్ నాస్త్య యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు.

అది కొంచెం పాపులర్ అవగానే బొమ్మలకు రివ్యూ ఇవ్వడాన్ని అనస్తాసియా ప్రారంభించింది.దీంతో ఫాలోవర్లు విపరీతంగా పెరిగారు.

అలా మరికొన్ని చానళ్లను ప్రారంభించారు.వీటి ద్వారా గతేడాది ఆమెకు వచ్చిన ఆదాయం ఏకంగా రూ.200 కోట్లు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

తనలోన వైకల్యమున్నా, దాన్ని చిన్నతనంలోనే ఎదిరించింది ఆ బాలిక.సోషల్ మీడియాలో విజయవంతం కావడం ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube