లైగర్ ముగించిన రౌడీ స్టార్‌ ఏం చేస్తున్నాడు?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత రెండు సంవత్సరాలుగా లైగర్ సినిమా పనిలోనే ఉన్నాడు.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది.

 Vijay Devarakonda Next Movie Update Coming Soon Details, Vijay Devarakonda, Lige-TeluguStop.com

ప్రస్తుత నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ను వచ్చే ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి చిత్ర యూనిట్ సభ్యులు అంతా సవ్యంగా జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు.

విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా విషయం లో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, కానీ పూరి జగన్నాథ్ మాత్రం తర్వాత తన సినిమా జనగణమన అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

ఆ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కనుక రౌడీ స్టార్‌ తదుపరి సినిమా అదే అయ్యి ఉంటుంది అని కొందరు భావించారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ జనగణమనకు ముందు సుకుమార్ దర్శకత్వం లో లేదా శివ నిర్వాణ దర్శకత్వం లో ఒక సినిమా లో చేసే అవకాశం ఉంది అంటూ మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

భారీ ఎత్తున విజయ్ దేవరకొండ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Puri Jagannath, Janaganamana, Liger, Shiva Nirvana, Sukumar-Movie

రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం చేసిన హెయిర్ స్టైల్ మరియు డిఫరెంటు లుక్ ను మెయింటెన్ చేసిన విజయ్ దేవరకొండ ఇటీవలే మార్చడం జరిగింది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ తదుపరి సినిమా కోసం ఏం చేస్తున్నాడు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమ్మర్లో ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తే చూడాలని కోరుకుంటున్నాం అంటూ వారు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు.

మరి విజయ్ దేవరకొండ నుండి ఆయన తదుపరి సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube