సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి.
సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడం ఒక కారణం అయితే.పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేయడం మరొక కారణం.
ఈమె విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ విడాకుల తర్వాత మాత్రం వరుస సినిమాలు అంగీకరిస్తూ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.
టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్ధం అయ్యింది.ఇక ఈమె ఫ్యాషన్ లో ఎంత ట్రెండింగ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎప్పటి కప్పుడు సరికొత్త ఫ్యాషన్ ను ఫాలో అవుతూ ఉంటుంది.
ఆమె స్టయిల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఈమె ఏ ట్రెండ్ ఫాలో అయిన ఆమె అభిమానులకు బాగా నచ్చుతాయి.తాజాగా ఈ బ్యూటీ మరొక ఫ్యాషన్ ను తీసుకు వచ్చింది.
సామ్ హ్యాండ్ పెయింటెడ్ శారీలో మెరిసింది.ఈమె శారీ నటి అర్చన జాజు చేతితో పెయింట్ చేసింది.
ఈ చీర కట్టుకుని అద్భుతమైన లుక్ తో ఆకట్టుకుంటుంది.సామ్ ఫోటోలు ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా మరోసారి ఈమె చీర కట్టుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె చీర ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు.ఆమె కట్టుకున్న చీర ధర అక్షరాల రూ.1,14,999.ఈ ధర విన్న వారంతా షాక్ అవుతున్నారు.ఇంత ట్రెండ్ సెట్ చేయడం కేవలం సామ్ కి మాత్రమే చెడుతుంది.ఈమె ట్రెండ్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటుంది.
ప్రసెంట్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచింది.అలాగే రెండు ద్విభాషా చిత్రాలను లైన్లో పెట్టింది.తర్వాత ప్రాజెక్ట్ యశోద షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి కూడా చేసింది.
అలాగే ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఈమె చేతిలో ఉంది.దీంతో సామ్ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.
రానున్న రోజుల్లో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం లేకపోలేదు.