పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా గురించే ప్రస్తుతం అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందుతుంది పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది.మరొక రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో వరుస ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్.ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ కు ఊహించని స్పందన వచ్చింది.టాలీవుడ్ లో అతివేగంగా 8 మిలియన్ వ్యూస్ సాధించిన ట్రైలర్ గా భీమ్లా నాయక్ ట్రైలర్ రికార్డ్ సృష్టించింది.
తాజాగా ఈ ట్రైలర్ పై మెగా పవర్ స్టార్ స్పందించారు.
బాబాయ్ సినిమా ట్రైలర్ ను ప్రశంసిస్తూ పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.చరణ్ పోస్ట్ చేస్తూ.భీమ్లా నాయక్” ట్రైలర్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రివ్యూ ఇచ్చేసారు.
#భీమ్లా నాయక్ ట్రైలర్ ఎలెక్ట్రిఫయింగ్ పవన్ కళ్యాణ్ గారి ప్రతి డైలాగ్ & యాక్షన్ పవర్ ఫుల్.నా మిత్రుడు రానా పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్ అద్భుతం.
ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ ముగించాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక రామ్ చరణ్ కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నాడు.