మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.ఏప్రిల్ 1న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ఇన్నాళ్లు కేవలం తెలుగు వర్షన్ మాత్రమే అనుకున్నారు కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి ఆచార్యని హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
చిరుకి ఎలాగు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే ఆర్.ఆర్.ఆర్ తో రాం చరణ్ అక్కడ స్టార్ గా ఎదగడం ఖాయం.ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ ని వాడుకునేలా ఆచార్యని కూడా బాలీవుడ్ లో గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే దీనికి సంబందించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.
హిందీ వర్షన్ కి భారీ రేటు పలికినట్టు టాక్.ఆల్రెడీ తెలుగు సినిమాలు హిందీ ఆడియెన్స్ ని మెప్పిస్తున్న టైం లో ఆచార్యకి ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమే అని చెప్పాలి.
ఆచార్య కూడా హిందీ రిలీజ్ అయితే ఈ సినిమా కూడా పుష్ప రేంజ్ హిట్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.