తెలంగాణ సీఎం కేసీఆర్ తన రాజకీయ వ్యూహం మార్చుకున్నారు.కేంద్ర బీజేప ప్రభుత్వం, పీఎం మోడీనే టార్గెట్ చేస్తూ కాలుదువ్వుతూ వచ్చారు.
జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని, ఒక వెలుగు వెలగానలని భావిస్తున్న కేసీర్ ఏకంగా బీజేపీపై యుద్ధమే ప్రకటించారు.ఇది సక్సెస్ అవుతుందా ? అతనితో జతకట్టేవారెవరు ? అనేవి హాట్ టాపిక్‌గా మారాయి.కేసీఆర్ పొలిటికల్ కేరీర్‌లో ఏదైనా తలిస్తే అది సాధించే వరకు వెన్నుచూపించని పోరాట నాయకుడిగా కీర్తిస్తుంటారు.నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏండ్ల తరబడి కొట్లాడి రాష్ట్రం సాధించిన ఘనత ఉంది.
ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకొచ్చారు.అయితే రాష్ట్రంలో అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌ను కట్టడి చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
రాష్ట్ర సమస్యలకు పరిష్కారం కూడా చూపని పరిస్తితి.ఈ క్రమంలోనే కేసీఆర్ దృష్టి కేంద్రంపై పడింది.
పలుప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు.గతంలోనే పలు రాష్ట్రాలలో పర్యటించి నేతలను కలిశారు కూడా.
అది కాస్త ఆదిలోనే విరమించుకున్నారు.బీజేపీ పాలనతీరుకు విసిగి వేసారిన కేసీఆర్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ముందుకుసాగుతున్నాడు.
కేంద్రంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంపై ప్రభావం చూపుతోంది.పాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.ధాన్యంతో మొదలు విద్యుత్ వరకు అనేక సంస్కరణలు కేంద్రం తీసుకురావడం, రాష్ట్రంలో రైతులకు సర్ధిచెప్పుకునే పరిస్థితి కూడా లేదు.కక్క లేక మింగలేక ధాన్యం కొనుగోలుపై యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది.
ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగి దీక్షలు కూడా చేశారు.
ఇంతలోనే విద్యుత్‌కు సంబంధించి మీటర్లు పెట్టాలని కేంద్రం సంకేతాలు ఇవ్వడంతో కేసీఆర్ నిప్పులు చెరుగుతున్నారు.మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ విషయాల్లో సవరణలకు కేంద్రం ప్రతిపాదించింది.ఇవన్నీ రాష్ట్రాల హక్కులను హరించేవే.
ఈ విషయంలో పలు రాష్ట్రాల సీఎంలు ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలోనే మరికొందరు మౌనంగా ఉండడంతో బీజేపీ రెచ్చిపోతోంది.
వెంటనే ముకుతాడు వేయకుంటే మొదటికే మోసం వస్తుందని గుర్తించిన కేసీఆర్ బీజేపీని, మోడీని టార్టెట్ చేసినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ప్రత్యేక కూటమికి పావులు కదుపుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జితో జట్టు కట్టేందుకు సీఎం సిద్ధమయ్యారు.
బీహార్ ప్రతిపక్షం ఆర్‌జేడీ, ఒడిసా, బీహార్, జార్ఘండ్, తదితర బీజేపీయేతర ప్రాంతీయ పాలకులను కలుపుకుని మోడికి గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.అవసరమైతే పార్టీ పెడతానంటూ ప్రకటించారు.
అందరూ కలిసి జతకడితే కేసీఆర్ వ్యూహం ఫలించక మానదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.