ప్రపంచంలోని ఒక్కో దేశంలో ఒక్కొలా ప్రజలు అలవాట్లను కలిగి ఉంటారు.వారు పాటించే పద్ధతులు కూడా దాదాపు పూర్తి డిఫరెంట్ గానే ఉంటాయి.
అలాగే అన్ని దేశాల్లో వాతావరణ పరిస్థితులు ఒకే విధంగా అస్సలు ఉండవు.అందుకే వాళ్ల ఆచారాలు, పద్ధతులు చాలా భిన్నంగా ఉంటాయి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక స్వీడన్ మహిళ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.ఆమె ప్రపంచ దేశాలకు భిన్నంగా తాము బట్టలు ఎలా వాష్ చేస్తామో ప్రపంచానికి తెలియజేసింది.
ఈ మహిళ పేరు జొన్నా జింటన్.ఈమె ఉత్తర స్వీడన్ లో నివసిస్తుంది.
అక్కడి జీవన విధానం గురించి ఆమె తరచూ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో తెలియజేస్తుంది.అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియోలో బట్టలు ఉతకడం ఎంత కష్టమో ఆమె చేసి చూపించింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో జొన్నా అనే మహిళ ఒక ఐరన్ వెపన్ తో గడ్డ కట్టిన మంచుని కోయడం మనం చూడొచ్చు.ఆమె ఆ పదునైన ఆయుధంతో నాలుగు అడుగుల స్థలంలో మంచు తొలగించి అందులో బట్టలు ఉతకడం గమనించవచ్చు.అక్కడ ఎలాంటి బండరాయిలు లేకపోవడంతో ఒక కుర్చీ సహాయంతో బట్టలు మురికిని వదిలింది.ఆ తర్వాత వాటిని ఆరేయడానికి ఆమె అనేక తంటాలు పడింది.దాదాపు నడుము ఎత్తులో పేరుకుపోయిన మంచును దాటుకుంటూ ఆమె ఒక స్తంభం పై బట్టలు ఆరేసింది.ఆ ప్రాంతంలో అప్పటికీ మంచు కురుస్తూనే ఉంది.
స్వీడన్ దేశంలో శీతాకాలంలో భారీ ఎత్తున మంచు కురుస్తుంది.ఈ సమయంలో బట్టలు ఉతకాలి అంటే చాలా కష్టాలు పడాల్సిందే.
అయితే మంచును కోసి ఐస్ గడ్డలను బయట పడేసి ఎముకలు కొరికే చన్నీళ్ళలో వట్టి చేతులతో బట్టలు ఉతికిన ఆమెను చూసి అందరూ షాక్ అవుతున్నారు.ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియోని ఎర్త్ పిక్స్ అనే ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసింది ఇప్పటికే దీనికి మూడు లక్షలకు పైగా లైకులు, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.దీనిపై చాలా మంది నెటిజన్లు ఫన్నీగా కూడా కామెంట్లు పెడుతున్నారు.
కనీసం గ్లోవ్స్ కూడా లేకుండా ఆమె చన్నీళ్ళలో చేతులు పెట్టడాన్ని చూసి చాలా మంది వామ్మో అంటున్నారు.అవే తమ చేతులు అయినట్లయితే వేళ్ళు అన్ని ఇప్పటికే కోసెయాల్సి వచ్చి ఉండేదని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
మరి కొందరు ఆమె కష్టాన్ని చూసి సరదాగా నవ్వుకుంటున్నారు.ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.