ఒకే ఏడాదిలో ముగ్గురు ఆప్తులను కోల్పోయిన మనోజ్ బాజ్ పాయ్

కొన్నిసార్లు శని మన చుట్టూనే తిరుగుతుందా.? అనేలా పరిస్థితులు ఉంటాయి.ఒకదాని వెంట మరొక కష్టం వచ్చి పడుతూనే ఉంటుంది.తాజాగా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్ పాయ్.ఆయన ఇంట్లో గడిచిన కొంత కాలంగా వరుస విషాదాలు జరుగుతున్నాయి.గత ఏడాది ఆయన తండ్రి, మామ చనిపోయారు.

 Manoj Bhajpai Lost 3 Family Members In 1 Year , Manoj Bhajpai, Shakila Raja, Del-TeluguStop.com

తాజాగా ఆయన అత్త చనిపోయారు.మనోజ్ భార్య షబానా తల్లి షకీలా రజా అనారోగ్యంతో తాజాగా కన్నుమూశారు.

ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.షకీలా రజాకు చాలా కాలం క్రితమే క్యాన్సర్ సోకింది.

నెమ్మదిగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది.ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం మరింత సీరియస్ అయ్యింది.

డాక్టర్లు ఆమెను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించారు.కానీ తను కన్నుమూశారు.

ప్రస్తుతం మనోజ్ పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు.ఆయన షూటింగ్ లో ఉండగానే తన అత్త మరణ వార్త విన్నాడు.వెంటనే తను షూటింగ్స్ కు బ్రేక్ చెప్పి.హుటా హుటీనా ఢిల్లీకి చేరుకున్నారు.గత ఏడాది కాలంలో ఆయన కుటుంబంలో ఇది మూడో మరణం.2021లో మనోజ్ మామ, షకీలా భర్త కన్నుమూశారు.అనారోగ్య సమస్యల కారణంగా తను కన్నుమూశాడు.అదే ఏడాది మనోజ్ తండ్రి ఆర్కే బాజ్ పాయ్ కూడా కన్నుమూశారు.ఆయన తండ్రి గత ఏడాది అక్టోబర్ 3 న చనిపోయాడు.కొన్ని రోజులు వయో భారంతో ఇబ్బందులు పడ్డ ఆయన.చికిత్స పొందుతూ కన్నుమూశాడు.ఆయన చనిపోయే నాటికి వయసు 83 ఏండ్లు.

మనోజ్ సొంతూరు బీహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెల్వా. ఆయన తండ్రి చనిపోయినప్పుడు ఆ గ్రామ ప్రజలంతా ఎంతో బాధపడ్డారు.ఎందుకంటే తను చాలా మంచి మనిషి.ఎంతో మంది నిరు పేదలకు సాయం చేశాడు.ప్రస్తుతం బాజ్ పాయ్ వయసు 57 ఏండ్లు.బాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.

తెలుగులోనూ తనకు మంచి క్రేజ్ ఉంది.అల్లు అర్జున్ మూవీ హ్యాపీలో తను పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.

తాజాగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ ఓటీటీల్లోనూ ఆయన దుమ్ము రేపుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube