కుర్రాడు అందంగా ఉంటే ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు అతని వెంట పడటం సహజం.మరీ అందంగా ఉంటే ఇంకో ఒక్కరో ఇద్దరో అనుకోవచ్చు.
కానీ ఒక కుర్రాడిని పెళ్లి చేసుకునేందుకు దాదాపుగా 5000 మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారట.మరి ఆ కథేంటో చూద్దాం పదండి.
ప్రస్తుతం టెక్నాలజీ వల్ల ప్రపంచంలో రోజుకో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.దీనికి తోడు యువత కొత్తదనం కోరుకుంటోంది.
ఇందుకోసం వారి అలవాట్లు, అభిరుచులు సైతం మారుతున్నాయి.
ఇలాంటి ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది.
ఈ విషయం చదివితే మీరు కూడా నోరెళ్ల బెట్టాల్సిందే.యూకేలో నివసిస్తున్న మహమ్మద్ మాలిక్ అనే 29 ఏళ్ల కుర్రాడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
కానీ అతనికి అరెంజ్‌డ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు.దీంతో అతడు వినూత్నంగా ఆలోచించాడు.
తనకు కాబోయే భార్య కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.బ్రిటన్ వీధుల్లో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు చక్కని అమ్మాయి కోసం వెతుకుతున్నట్టుగా బోర్డులు పెట్టాడు.
అరెంజ్‌డ్ మ్యారేజ్ నుంచి నన్ను రక్షించండి అంటూ బోర్డుల్లో రాశాడు.దీంతో అతడికి ఏకంగా 5వేల మంది అమ్మాయిల నుంచి సంప్రదింపులు వచ్చాయట.
కానీ మహమ్మద్ మాలిక్ డేటింగ్ యాప్ ప్రచారం కోసమే ఇలా చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే అతడికి ఇప్పటికే పెళ్లి అయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇందుకోసం నెట్టింట ప్రత్యేక వెబ్‌పోర్టల్ findMALIKswife.com సైతం ఏర్పాటు చేశారని తెలుస్తోంది.వాస్తవానికి అతనికి పెళ్లి అయినా కాకున్నా.కానీ అతని ఆలోచన బాగుంది కదా.దీనిపై నెటిజన్స్ సైతం భిన్నంగా స్పందిస్తున్నారు.మరి ఈ కథ చివరికి ఎక్కడి వరకు చేరుతుందో చూడాలి.ఇంతటి ఘనకార్యం చేసిన అతడిని మీరూ ఓ సారి చూడండి మరి.