వెరైటీ వంటకాలకు కొదువే లేకుండా పోతుంది.ఫుల్ గా ప్రజాదరణ పొందిన వంటకాలను వెరైటీగా ట్రై చేసి సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వీడియోలను పెడుతున్నారు.
ఈ వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.ఆ వంటకాలకు కూడా యమ క్రేజ్ ఏర్పడుతోంది.
ఇలాగే ఇప్పటికే చాలా రకాల వెరైటీ వంటకాలు వెలుగులోకి వచ్చాయి.వంటకం టేస్ట్ చూడకున్నా నెటిజన్ల చూపుకు నచ్చితే ఆ వంటకం హైలెట్ అవుతుంది.
తాము చూసేందుకు నచ్చని వంటకాలను కూడా నెటిజన్లు కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.నచ్చిన వంటకాలైనా, నచ్చని వంటకాలైనా సరే వైరల్ కావడం మాత్రం పరిపాటిగా మారింది.
ఇప్పుడు కూడా నెట్టింట్లో ఓ ఫుడ్ రెసిపీ తెగ వైరల్ అవుతోంది.ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఏమని కామెంట్ చేస్తున్నారంటే…
పానీ పూరీ ఐస్ క్రీం, ఓరియో బిస్కట్లతో పకోడీలు, నూడిల్స్ పకోడి, ఎగ్ దోసె ఇలా రకరకాల వంటకాలు ఇప్పటకే వైరల్ అయ్యాయి.
తాజాగా ఐస్ క్రీం మసాలా దోసె వంటకం కూడా వైరల్ అవుతోంది.కానీ ఈ వంటకం మాత్రం నెటిజన్లకు అంతగా నచ్చడం లేదు.
మసాలా దోసె మీద ఐస్ క్రీం వేయడం ఏం కాంబినేషన్ రా బాబూ అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.ఆ వంటకం టేస్ట్ ఎలా ఉంది? అని ఎవరూ చూడకపోయినా కానీ దానిని చూస్తేనే బాగా లేదని అంటున్నారు.
దోసె సౌతిండియన్ స్పెషల్ డిష్.అనేక రకాల దోసెలు మనకు అందుబాటులో ఉన్నాయి.సౌతిండియాలో ఎక్కువ మంది దీనిని పొద్దున బ్రేక్ ఫాస్ట్ లా తింటూ ఉంటారు.కానీ అటువంటి దోసెతో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి కొత్తగా ప్రయోగం చేశాడు.
మసాలా దోసెకు ఐస్ క్రీం యాడ్ చేసి దానిని రోల్స్ లా తయారు చేశాడు.ఈ రోల్స్ ను ఒక ప్లేట్ లో ఉంచి చట్నీతో సర్వ్ చేస్తున్నాడు.
అతడు మసాలా దోసె తో ఐస్ క్రీం మసాలా దోసెను ఎలా తయారు చేస్తున్నాడో ఓ సారి లుక్కేయండి.