వయసు పైబడే కొద్ది చర్మంపై ముడతలు, సన్నని గీతలు ఏర్పడటం సర్వ సాధారణం.కానీ, ఇటీవల రోజుల్లో చాలా మంది ఆహారపు అలవాట్లు, కాలుష్యం, కెమికల్స్ ఎక్కువగా ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను వాడటం, పోషకాల కొరత ఇలా రకరకాల కారణాలు చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలను ఎదుర్కొంటూ యవ్వనత్వాన్ని కోల్పోతున్నారు.
ఈ క్రమంలోనే తరచూ అద్దంలో చర్మాన్ని చూసుకుంటూ ఎంతగానో మదన పడిపోతుంటారు.అలాగే వృద్ధాప్య ఛాయలను ఎలా నివారించుకోవాలో తెలియక తెగ సతమతం అయిపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే యాంటీ ఏజింగ్ డ్రింక్‌ను వారంలో కేవలం మూడు సార్లు తీసుకుంటే నిత్య యవ్వనంగా మెరిసి పోవచ్చు.మరి లేట్ ఎందుకు ఆ యాంటీ ఏజింగ్ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? ఏ టైమ్‌లో తాగాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక క్యారెట్, ఒక బీట్ రూట్, రెండు పండు టమాటోలు, ఒక కీర దోస తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు, టమాటో ముక్కలు, కీర దోస ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను వేరు చేసుకుని ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనె కలుపుకుంటే యాంటీ ఏజింగ్ డ్రింక్ సిద్ధమైనట్టే.ఈ డ్రింక్‌ను ఉదయం టీ, కాఫీల సమయంలో తీసుకోవాలి.
తద్వారా అందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలకు అడ్డు కట్ట వేసి చర్మాన్ని యవ్వనంగా, కాంతి వంతంగా మెరిపించేలా చేస్తాయి.
పైగా ఈ డ్రింక్‌ను తీసుకోవడం వల్ల రక్త హీనత దరి చేరకుండా ఉంటుంది.గుండె ఆరోగ్యంగా ఉంటుంది.మరియు కంటి చూపు సైతం పెరుగుతుంది.