అగ్ర రాజ్య అధ్యక్షుడు జో బిడెన్ ఏ ముహూర్తాన అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టారో కానీ అమెరికాపై కరోనా ప్రభావం మాత్రం తీవ్ర స్థాయిలో చూపిస్తోంది.గత వేరియంట్ ల ధాటికి అమెరికా ఆర్దిక వ్యవస్థ కుప్ప కూలగా, ఫెడరల్ ఉద్యోగులకు వేతనాలు సైతం చెల్లించలేని పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం.
కరోన కారణంగా లక్షలాది మందికి నిరుద్యోగ బృతి కల్పించి తరువాత నిధులు చెల్లించలేని పరిస్థితిలో చేతులు ఎత్తేసిందని ప్రభుత్వంపై రిపబ్లికన్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు.ఇప్పటికీ గత వేరియంట్స్ మిగిల్చిన నష్టం నుంచీ బయటపడలేక కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వానికి తాజాగా కొత్త వేరియంట్ ఒమెక్రాన్ ఆందోళన కలిగిస్తోంది.
గతంలో బడా వ్యాపారస్తులు, హోటల్స్, ఫ్యాక్టరీలు, రెస్టారెంట్స్ ఇలా అన్నీ ఆదాయ వనరులపై కరోనా పంజా విసరడంతో ఇప్పటికి కూడా ఆ ఆర్ధిక నష్టం నుంచీ కోలుకోలేక పోయాయి.దాంతో మరో సారి వీరందరూ తాజా వేరియంట్ రాకతో ఆందోళన చెందుతున్నారు.
సెనేట్ సభ్యులు, వ్యాపారస్తులు, అమెరికన్స్ మళ్ళీ వచ్చే ఆర్ధిక సంక్షోబాన్ని తట్టుకునే శక్తి మనకు ఉందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.దాదాపు రెండేళ్ళుగా ఈ మహమ్మారిని ఎదుర్కుంటూ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో తాజా వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపుతోందోనని భయాందోళనలకు లోనవుతున్నారు.
బిడెన్ ప్రభుత్వం సాధించిన ఆర్ధిక ప్యాకేజీ ఇప్పటికే నష్టాలలో ఉన్న సంస్థలు, వ్యాపార సముదాయాలు, చిన్న చిన్న వ్యాపారాలు, రెస్టారెంట్లు, నిరుద్యోగులు, ఉద్యోగుల జీతాలు, వీటికే సరిపోతోంది.పైగా స్టూడెంట్స్ లోన్ ప్రొటక్షన్, ఆసుపత్రుల నిర్వహణ, స్వచ్చంద సంస్థలు, పరిశోధనలు ఇలా అన్నింటికి నిధులు సరిపోతున్నాయి.కానీ కొత్త వేరియంట్ ఉదృతం అయితే గత నష్టాన్ని పూడ్చడానికే ముప్పు తిప్పలు పడిన బిడెన్ ప్రభుత్వం ఈ సారి నెలలోనే ఆర్ధిక సంక్షోబాన్ని ఎలా ఎదుర్కుంటుందోనని, ఇది ఖచ్చితంగా బిడెన్ కు అతిపెద్ద సవాలే అంటున్నారు ఆర్ధిక నిపుణులు.