ప్రకృతి బాగుంటేనే మనందరం బాగుంటం.అడవులు పచ్చగా ఉంటేనే జీవరాశులన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి.
మానవ మనుగడకు పర్యావరణం, జీవరాశులు ఎంతో అవసరం.ఇందులో ఏది సరిగా లేకపోయినా మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రకృతిని పట్టించుకోకపోవడం వలన జలజీవ రాశులు, జంతువులు అంతరించిపోతున్నాయి.ఈ జాబితాలో తాబేళ్లు కూడా ఉన్నాయి.
అయితే, తాబేళ్లను కొన్నేండ్లుగా ఓ యువతి రక్షిస్తూ వస్తోంది.ఈ క్రమంలోనే 2021 గాను ‘నాట్‌వెస్ట్ గ్రూప్ ఎర్త్ హీరోస్ సేవ్ ది స్పేసీస్’అవార్డును అందుకుంది.
దేశానికి చెందిన ఎన్విరాన్ మెంటల్ లవర్ అరుణిమా సింగ్.ఈ యువతి అరుదైన తాబేళ్లు, మొసళ్లు, గంగా డాల్ఫిన్‌లను రక్షిస్తోంది.గత ఎనిమిదేళ్లుగా అరుణిమా దాదాపు 28వేల తాబేళ్లను రక్షించి రికార్డులకెక్కింది.యూపీ రాష్ట్రం లక్నోకు చెందిన అరుణిమా గ్రామీణ, పట్టణాల్లోని సుమారు 50 వేల మంది పిల్లలకు మంచి నీటి జంతువులు, వాటి రక్షణ గురించి అవగాహన కల్పిస్తోంది.
ఇప్పటివరకు అనధికారికంగా యూపీలో గత 8 ఏళ్లుగా 28 వేల తాబేళ్లు, 4 ఘారియల్, 25 గంగా డాల్ఫిన్లు, 6 మార్ష్ మొసళ్లలను రక్షించింది.వాటిలో కొన్నింటికి పునరాసవం కల్పించి, మళ్ళీ నీటిలో వదిలేసింది.
తనకు నీటిలో జీవించే సరీసృపాల పట్ల చిన్నప్పుడే ఆకర్షణ ఏర్పడిందని అరుణిమా తెలిపింది. తాతతో కలిసి నది వద్దకు వెళ్ళినపుడల్లా పర్యావరణం పట్ల ప్రేమ ఏర్పడిందని తెలిపింది.2010లో లక్నో యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్స్‌లో పీజీ కోర్సు, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా యూపీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ , TSA ఇండియా ప్రోగ్రాం ఫర్ ఆక్వాటిక్ బయాలజీ ద్వారా 10 కంటే ఎక్కువ జాతుల తాబేళ్ల కోసం హామీ కాలనీలను స్థాపించడంలో కీలకపాత్ర పోషించింది.ఇందులో అధికంగా అంతరించిపోతున్న తాబేళ్లే ఉన్నాయని తెలిసింది.సుమారు 300 మచ్చల తాబేళ్లకు పునరావాసం కల్పించి, వాటిని 60 రోజుల పాటు సంరక్షించి అడవిలోకి వదలింది.
అరుణిమాను చర్యలను చూసి ప్రకృతి ప్రేమికులు ఎంతో మెచ్చుకుంటున్నారు.