ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఒకరోజు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.కానీ బీఏసీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఇంకా సమావేశాలు పొడిగించాలని పట్టుబట్టడంతో.
సీఎం జగన్ ఓకే చెప్పడంతో.ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
అసెంబ్లీ సమావేశం ఒక రోజు కాకుండా పొడిగించాలని బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష టీడీపీ కోరడంతో వెంటనే సీఎం జగన్ ఒప్పుకోవడం విశేషం.తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం జగన్ మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు పాల్గొనడం జరిగింది.
టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు మరి కొంతమంది నాయకులు హాజరయ్యారు.ఈ క్రమంలో ఒకరోజు మాత్రమే కాక మరికొన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని.
టిడిపి నాయకులు ఈ సమావేశంలో కోరటంతో.జగన్ ఓకే చెప్పడం జరిగింది.
సానుకూల వాతావరణంలో సభ సజావుగా సాగేలా.టీడీపీని వ్యవహరించాలని జగన్ కోరినట్లు.
అదేవిధంగా.ప్రతిపక్షాలకు దీటైన రీతిలో సమాధానాలు చెప్పాలని వైసీపీ ప్రజాప్రతినిధులకు జగన్ తెలియజేసినట్లు సమాచారం.