బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.సుశాంత్ సింగ్ కుటుంబానికి చెందిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
సుశాంత్ బంధువు ఓంప్రకాష్ సింగ్ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి జమూయి పట్టణానికి తిరిగివస్తుండగా లికిసరాయ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వారు ప్రయాణిస్తున్న టాటా సుమో ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టడంతో నుజ్జు నుజ్జు అయ్యింది.
ఈ సంఘటన జరిగిన సమయంలో సుమో లో మొత్తం 10 మంది ఉన్నారు.వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ సుశాంత్ సింగ్ బావ, హర్యానా కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఓం ప్రకాశ్ సింగ్ మరియు సమీప బంధువులే.నేషనల్ హైవే 333 పై సికింద్ర, షేక్ పుర మధ్య పిప్రా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఖాళీ ఎల్పిజి సిలిండర్ లోడుతో వస్తున్న ట్రక్కును బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
డ్రైవర్ తో పాటు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందాడు.మిగిలిన నలుగురిని జమూయి లోని సదర్ హాస్పిటల్ కి తరలించారు.వారి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది.ఈ ప్రమాదంలో మరణించిన వారిని లలిత సింగ్, ఆయనకు ఇద్దరు కుమారులు అమిత్ శేఖర్, రామచంద్ర సింగ్, కుమార్తె బేబీ దేవి మేనకోడలు అనితా దేవి, డ్రైవర్ ప్రీతమ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు.
లలిత్ సింగ్ హర్యానాలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయినా ఓం ప్రకాష్ సింగ్ కు బావమరిది.