ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్య ఓ కొత్త విప్లవం పుట్టు కొస్తోంది.అదే స్వలింగ సంపర్కుల విజయ గాథలు.
ఇప్పటికే వీరు ఎన్నో రంగాల్లో సత్తా చాటుతున్నారు.అంతెందుకు ప్రపంచంలోనే ఫేమస్ అయిన యాపిల్ కంపెనీ సీఈవో కూడా ‘గే’ అన్న విషయం విదితమే.
కాగా ఇప్పుడు ఈ విప్లవం ఇండియాకు కూడా చేరుకుంది.తమపై సమాజంలో వివక్ష చూపిస్తున్నారంటే తీవ్రంగా కుంగిపోతున్న వారికి ఈ విప్లవంతో తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఉపయోగపడుతోంది.
కాగా ఇప్పుడు వీరి విషయంలో దేశ చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయం నమోదయింది.
ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదనే చెప్పాలి.
ఇప్పటి వరకు ఇలాంటి వారు న్యాయ వ్యవస్థలో పెద్ద స్థాయిలో లేరు.ఇలాంటి వారు పెండ్లిలు చేసుకుంటున్న ఘటనలు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నా కూడా పెద్ద స్థాయిల విషయానికి వస్తే మాత్రం అది లేదు.
కానీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఓ గే లాయర్ నియామకం కావడం పెను సంచలనం రేపుతోంది.ఇది నిజంగా దేశ చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయం అనే చెప్పాలి.
సుప్రీంకోర్టు కోలిజియం తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి కేంద్రం గనక ఓకే చెబితే తొలిసారి స్వలింగ సంపర్కులకు జడ్జి పదవి దక్కనుంది.
ఈ గే లాయర్ పేరు సౌరభ్. లండన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ఆ తర్వాత సుప్రీంకోర్టులో 20ఏండ్లకు పైగా లాయర్‌గా తన సేవలు అందించారు.మోస్ట్ సీనియర్ లాయర్ గా ఎంతో మందిని తీర్చిదిద్దారు.
వేలాది కేసులను వాదించిన లాయర్ గా ఆయనకు గుర్తింపు కూడా ఉంది.అయితే గతంలో 2017 అక్టోబర్ లో సౌరభ్‌కు జడ్జిగా పదోన్నతి ఇవ్వాలంటూ హైకోర్టు కొలీజియం ప్రతిపాదించినా కూడా అది సక్సెస్ కాలేదు.
కానీ ఈ సారి ఏకంగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడంతో కచ్చితంగా అయ్యే అవాకశం ఉందని తెలుస్తోంది.
.