ఏడేళ్ల తర్వాత పెళ్లికి సిద్దమైన బుల్లితెర నటి.. ఎవరంటే?

సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో వెండితెర సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ బుల్లితెర నటీనటులు కూడా సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే హిందీ బుల్లితెరపై ‘కుండ‌లి భాగ్య‘అన్ని సీరియల్ ద్వారా నటి మాన్సీ శ్రీవాస్త‌వ‌ విశేష ఆదరణ దక్కించుకున్నారు.

 After Seven Years Tv Actress Mansi Srivastava Is Geting Ready For Marrige , Mans-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈమె ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే ఈ నటి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందని తెలుస్తోంది.

ఈమె ఫుడ్ అండ్ ట్రావెల్ ఫొటోగ్రాఫ‌ర్ క‌పిల్ తేజ్వానీతో గత ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.

ఈ మేరకు ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.తాజా కథనాలను ప్రకారం మాన్సీ, క‌పిల్ కొన్నేళ్ల క్రితం ఓ యాడ్ షూటింగ్‌లో క‌లిశారు.

కానీ ఆ త‌ర్వాత ఏడేళ్ల తర్వాత కలుసుకున్న ఈ జంట ప్రేమలు పడినట్లు తెలుస్తుంది.అయితే వీరిద్దరూ ఒక యాడ్ లో భాగంగా మొదటి సారి కలిసినప్పుడు వీరి చూపులు కలవలేదని మరి రెండు మూడు సార్లు కలిసిన తర్వాత ఈ జంట మధ్య స్నేహం ఏర్పడి ఆ తర్వాత ప్రేమలో పడ్డారని అలా 2019 వ సంవత్సరంలో ఈ విషయాన్ని బయటకు తెలియజేశారు.

అయితే మొదట్లో స్నేహితులుగా ఉన్న వీళ్ళు ఆ తర్వాత ప్రేమికులుగా మారి మరి కొద్ది రోజులలో భార్యాభర్తలుగా మారనున్నారు.అయితే వీరి వివాహం వచ్చే ఏడాది జనవరిలో ముంబైలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మాన్సీ  ‘కుండ‌లీ భాగ్య’సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.త్వరలోనే వీరి పెళ్లిని అధికారకంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube