షారుఖ్ ఖాన్ కూడా ఒకప్పుడు జైలుకు వెళ్లాడని మీకు తెలుసా..?

బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టయి ఆర్థర్ రోడ్ జైలులో మూడు వారాల పాటు ఉన్న సంగతి తెలిసిందే.కాగా, ఎట్టకేలకు బెయిల్ పై విడుదలయ్యాడు.

 Why Shahrukh Khan Went To Jail Details, Sharukh Khan, Aryan Khan, Aryan Khan Dru-TeluguStop.com

కాగా, గతంలో ఆర్యన్ ఖాన్ తండ్రి షారుఖ్ ఖాన్ కూడా జైలుకు వెళ్లాడన్న సంగతి మీకు తెలుసా.షారుఖ్ ఏ విషయంలో జైలుకు వెళ్లాడన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

తాను కటకటాల పాలయిన సంగతిని షారుఖ్ స్వయంగా ఓ ఈవెంట్‌లో షేర్ చేసుకోవడం గమనార్హం.తాను ఓ జర్నలిస్టును చంపుతానని నిజంగానే బెదిరించానని, అది కూడా మామూలుగా కాకుండా కత్తితో బెదిరించానని వివరించాడు.

అలా తాను ఓ పాత్రికేయుడిని బెదిరించడానికి గల కారణాన్ని కూడా షారుఖ్ తెలిపాడు.తనకు ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందని రాసినందుకుగాను జర్నలిస్టును బెదిరించానని, అప్పటికీ తనకు పెళ్లై రెండేళ్లే అయిందని షారుఖ్ పేర్కొన్నాడు.

తాను ఆ సందర్భంలో చాలా దారుణంగా ప్రవర్తించానని షారుఖ్ గుర్తు చేసుకున్నాడు.తన మామయ్య పంజాబీ అని, గౌరీఖాన్‌తో పెళ్లి సమయంలో తనకు ఓ ఖడ్గం ఇచ్చాడని, ఆయనో ఆర్మీ ఆఫీసర్ అని వివరించాడు.

Telugu Aryan Khan, Aryankhan, Bollywood Drugs, Gowry Khan, Shah Rukh, Sharukhkha

అలా తన కూతురిని కాపాడాలని తన మామ ఇచ్చిన ఖడ్గాన్ని ఓ జర్నలిస్టును భయపెట్టించేందుకుగాను ఉపయోగించానని చెప్పాడు షారుఖ్.ఈ విషయంలో జర్నలిస్టు ఫిర్యాదు మేరకు తాను జైలుకు వెళ్లానని, అలా జైలుకు వెళ్లినప్పటకీ తనకు ఆ జర్నలిస్టుపై కోపం తగ్గలేదని పేర్కొన్నాడు.ఆ టైంలో జైలు నుంచి ఎవ‌రికైనా ఫోన్ చేసుకునే చాన్స్ ల‌భించిన‌ప్పుడు కూడా తాను సదరు జ‌ర్న‌లిస్టుకే ఫోన్ చేశానని, అతడిని జైలు నుంచి వచ్చాక సంగతి చూస్తానని హెచ్చరించానని, నరికేస్తానని చెప్పానని ఫన్నీ వేలో షారుఖ్ పేర్కొన్నాడు.

Telugu Aryan Khan, Aryankhan, Bollywood Drugs, Gowry Khan, Shah Rukh, Sharukhkha

మొత్తంగా తండ్రి షారుఖ్ జర్నలిస్టును బెదరించి జైలుకు వెళ్లగా, తనయుడు ఆర్యన్ ఖాన్ మాత్రం డ్రగ్స్ కేసులో పట్టుబడి మూడు వారాల పాటు జైలులో గడిపాడు.ఎన్‌సిబి అధికారులు ఈ డ్రగ్స్ కేసును విచారిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube